Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP SELF ASSESSMENT - I TEST TIME TABLE & SYLLABUS

AP SELF ASSESSMENT - I TEST TIME TABLE  & SYLLABUS

AP SELF ASSESSMENT - I TEST TIME TABLE  & SYLLABUS

 1. జిల్లా లోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో (1 నుండి 10వ తరగతి వరకు) SCERT AP వారి ద్వారా జారీ చేయబడ్డ ప్రశ్న పత్రాలతో మాత్రమే తేదీ 27.08.2024 నుండి స్వీయ మదింపు మాదిరి ప్రశ్న పత్రములు-1 (SELF ASSESSMENT - I TEST MODEL PAPERS-1) 

2. సూచన 2 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు వారి ఉపాధ్యాయులు తయారు చేసుకున్న ప్రశ్నపత్రములతో ఇవ్వబడిన కాల నిర్ణయ పట్టిక ప్రకారం స్వీయ మదింపు మాదిరి ప్రశ్న పత్రములతో పరీక్షలు నిర్వహించాలి

3. 1 వ తరగతి నుండి 8 తరగతి వరకు గల విద్యార్ధులకు OMR లతో పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. 9వ మరియు 10వ తరగతుల విద్యార్థులకు, గతంలో మాదిరిగానే సాధారణ పద్ధతిలో SAMP-1 పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.

4. ప్రశ్న పత్రంలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో పాటు డిస్క్రిప్టివ్ తరహా ప్రశ్నలు కూడా ఇవ్వబడతాయి. విద్యార్ధులు జవాబులను ప్రశ్న పత్రం లోనే టిక్ చేయాలి/ వ్రాయాలి మరియు OMR నందు బబుల్ చేయాలి.

5. ప్రశ్న పత్రములో ప్రశ్నలు-మార్కుల క్రమము బహుళైచ్ఛిక ప్రశ్నలు 10+ స్విచ్ఛ సమాధాన ప్రశ్నలు 5 = మొత్తం మార్కులు 20 మరియు సమయం 1 గంట

మండల కమిటీ వారు చేయవలసిన పనులు

  • మండల విద్యాశాఖ అధికారి 1 & 2 మరియు మండలంలోని ఒక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కలసి కమిటీగా ఏర్పడి ఉండి ఈ పరీక్షలను సజావుగా నిర్వహించవలెను.
  • ముఖ్య గమనిక: ఈ సంవత్సరం కాల నిర్ణయ పట్టిక నిర్దేశించుటలో ఆలస్యమైన కారణంగా ప్రశ్నపత్రములు, OMR లు సెలవు దినాలైన తేదీ 25.8.24, 26.8.24 లలో MRC లకు పంపవలసి ఉన్నందున కమిటీ వారు సహకరించి తగు ఏర్పాట్లు చేసుకొని ప్రశ్నపత్రములను తీసుకొనవలసినదిగా మనవి.

 పరీక్షలకు ముందు చేయవలసిన పనులు

  • 6. జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం నుండి ప్రశ్నాపత్రాలను Variable OMR లను, Buffer OMRలను, పాఠశాల వారి విద్యార్థుల సంఖ్యలను తెలుపు లిస్టులను తీసుకొని సరి చూసుకొనవలెను. ప్రశ్నపత్రాలను మండల విద్యా శాఖాధికారి - 1 & 2 మరియు ఒక సీనియర్ ప్రధానోపాధ్యాయుని సమక్షములో స్ట్రాంగ్ రూమ్ లో కానీ, తాళముల వేసిన బాక్స్ లలో గాని భద్రపరచి వారి కస్టడీలో ఉంచుకొనవలెను.
  • 7. ఇవ్వబడిన లిస్టు ప్రకారం పాఠశాల వారీ Variable OMR లను విభజించి పాఠశాలలకు ఇవ్వవలెను. వారు పాఠశాలలోని అందరు విద్యార్ధులకు Variable OMR లు సరి పోయినవి / లేదు అని సరిచూసుకొన్న తరువాత అవసరమైన Buffer OMR లను 28.08.2024వ తేదీ ఇవ్వవలెను.
  • 8. అట్లే 1 నుండి 5వ తరగతి వరకు ప్రశ్నాపత్రాలను కాంప్లెక్స్ వారీగా విభజించుకొని, 26.08.2024వ తేదీ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ కు ఇచ్చి మరల వారు పరీక్ష రోజులలో వారి కాంప్లెక్స్ లోని పాఠశాలలకు రోజువారి ఇవ్వవలసినట్లుగా తెలియజేయవలెను.

పరీక్షల సమయంలో చేయవలసిన పనులు

  • 9. 6 నుండి 10వ తరగతి వరకు ప్రశ్నపత్రాలను అన్ని పాఠశాలలకు MRC నుండి మాత్రమే ప్రతిరోజు టైం టేబుల్ అనుసరించి పరీక్షకు ఒక గంట ముందుగా ఇవ్వవలెను. 

పరీక్షల అనంతరం చేయవలసిన పనులు

  • 10. పరీక్షల అనంతరం, అనగా 04.09.2024 తేదీ అన్ని పాఠశాలల నుండి OMR షీట్స్ పాకెట్స్ సికరించి, కన్సాలిడేటెడ్ లిస్టు తయారు చేసి స్కానింగ్ నిమిత్తమై 06.09.2024 తేదీ జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగము కార్యాలయానికి పంపాలి.

కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు చేయవలసిన పనులు

  • 11. కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లు వారి కాంప్లెక్స్ కు సంబంధించిన అన్ని పాఠశాలల యొక్క తరగతి వారి విద్యార్ధుల సంఖ్య లతో కూడిన లిస్టులను, 1 నుండి 5వ తరగతి వరకు ప్రశ్నాపత్రాలను MRC నుండి CRMT ద్వారా 26.09.2024వ తేదీ తప్పించుకొని తమ కస్టడీలో ఉంచుకొనవలెను.
  • 12. ప్రతి పరీక్ష రోజు పాఠశాలకు కేటాయించబడిన ప్రశ్నపత్రాలను, పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు ఇవ్వవలెను.పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు సూచనలు పరీక్షలకు ముందు చేయవలసిన పనులు
  • 13. మొదటగా మీ పాఠశాలలోని విద్యార్థుల యొక్క తరగతి వారీ లిస్టులను వారి child ID లతో తయారుచేసుకుని సిద్ధంగా ఉంచుకొనవలెను.
  • 14. 26.08.2024 వ తేదీ MRC నుండి మీ పాఠశాలకు సంబంధించిన Variable OMRలను తీసుకొని సరి చూసుకొనవలెను. Variable OMRలు కేటాయించబడని విద్యార్థుల కొరకు Buffer OMR లను MRC వద్ద నుండి 28.08.2024 తేదీ తీసుకొని విద్యార్థుల పేరు, child ID లను రాసుకొని సిద్ధముగా ఉంచుకొనవలెను.
  • 15. 15. Buffer OMR లను కేటాయించిన విద్యార్ధుల యొక్క Buffer OMRను అటిండెన్స్ యాప్ నందు ఆ విద్యార్థులకు జత చేయాలి.

పరీక్షల సమయంలో చేయవలసిన పనులు

  • 16. 6 నుండి పదవ తరగతి విద్యార్థుల యొక్క ప్రశ్నపత్రాలను ఏ రోజుకు ఆ రోజు MRC నుండి పరీక్షకు ఒక గంట ముందు తీసుకొని పాఠశాలకు రావలెను.
  • 17. పరీక్షకు ముందు విద్యార్ధులను క్రమంగా సరైన దూరములో కూర్చుండబెట్టి వారి వారి OMR లను వారికి అందజేయాలి, పేరు, child IDలు సరిపోయినవి / లేదు అని సరిచూసుకొనమని విద్యార్థులకు తెలియజేయాలి.
  • 18. తరువాత ప్రశ్నాపత్రాలను అందజేయాలి. పరీక్షా పత్రంలో రెండు రకముల ప్రశ్నలు ఉంటాయి.
  • 19. విద్యార్థులు OMRలపై బహుళైచ్ఛిక ప్రశ్నలకు మాత్రమే జవాబులు గుర్తించాలని, ఎంపిక లేని ప్రశ్నలకు జవాబులను OMR పై రాయవలసిన అవసరం లేదని విద్యార్థులకు తెలియజేయాలి
  • 20. అన్ని తరగతుల వారికి ఏ సబ్జెక్ట్ పీపర్ కు అయినా పరీక్షా సమయం ఒక్క గంట మాత్రమే అనుమతించాలి.
  • 21. ఒకే OMR పై అన్ని సబ్జెక్టులకు సంబంధించిన బబుల్ ఉంటాయి కాబట్టి ఏ పరీక్షకు ఆసబ్జెక్టుకు సంబంధించిన బబుల్స్ మాత్రమే విద్యార్థి నింపాలని తెలియజేయాలి, పర్యవేక్షించాలి.
  • 22. ప్రతిరోజు పరీక్ష పూర్తైన వెంటనే విద్యార్ధుల నుండి ప్రశ్నా పత్రంతో పాటు OMR షీట్ కూడా వెనుకకు తీసుకోవాలి.
  • 23. ప్రతి విద్యార్థి యొక్క OMR ను పరిశీలించి, విద్యార్థి ఏదైనా ప్రశ్నకు ఎంపికను గుర్తించనిచో ఆ ప్రశ్నకు ఉపాధ్యాయుడు E అనే ఎంపికను bubble చేయాలి.
  • 24. ఒక్కొక్క విద్యార్థికి అన్ని పరీక్షలకు కలిపి ఒకే OMR షీట్ ఇవ్వబడుతుంది. కనుక ప్రతిరోజు అదే OMR ను ఇచ్చి ఆ సబ్జెక్టు నందు జవాబులను బబుల్ చేయించవలెను
  • 25. 1, 2, 3 తరగతుల పరీక్ష నిర్వహణలో సూచనలు: ఉపాధ్యాయుడు ప్రతి ప్రశ్నను గట్టిగా చదివి విద్యార్థులు ఆ ప్రశ్నకు జవాబును గుర్తించిన తర్వాత మరియొక ప్రశ్నను గట్టిగా చదువుతూ విద్యార్థుల చే జవాబులను రాయించాలి. పరీక్ష అనంతరం విద్యార్ధుల నుండి ప్రశ్నాపత్రం లను సేకరించి వారి OMR లపై ఉపాధ్యాయుడే విద్యార్థి యొక్క జవాబులను బబుల్ చేయాలి.
  • 26. 4, 5 తరగతుల పరీక్ష నిర్వహణలో సూచనలు: OMRలపై విద్యార్థులే జవాబులను గుర్తించాలి. తెలుగు ఇంగ్లీషు పరీక్షలలో ప్యాసేజ్లను ఉపాధ్యాయుడు గట్టిగా చదివి వినిపించిన తరువాత విద్యార్థులు జవాబులను రాయాలని తెలియజేయాలి.

పరీక్షల అనంతరం చేయవలసిన పనులు

  • 27. పరీక్షలు పూర్తైన వెంటనే OMR పీట్స్ అన్నింటిని, తరగతి వారీగా ఉంచి, అన్నింటిని పాలిథిన్ కవర్ నందు, ప్యాక్ చేసి, మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయానికి 04.09.2024 తేదీ పంపాలి.
  • 28. 28. OMR షీట్స్ ను జిల్లా స్థాయిలో స్కాన్ చేయించడం జరుగుతుంది. OMR నందు విద్యార్ధులు పొందిన మార్కుల వివరాలు పాఠశాలలకు తెలియజేయబడవు. అవి కేవలం విద్యార్థుల స్థాయిని అంచనావేసి భవిష్యత్తులో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇవ్వవలసిన శిక్షణా కార్యక్రమాల రూపకల్పనకు మాత్రమే వినియోగించడం
  • 29. పరీక్షల అనంతరం ప్రతి తరగతి (1 నుండి 8 తరగతులకు మాత్రమే), ప్రతి సబ్జెక్టు నకు KEY విడుదల చేయబడుతుంది. దాని ప్రకారం ఉపాధ్యాయులు విద్యార్ధుల వద్ద నుండి ప్రతి రోజు పరీక్ష తదనంతరం వెనుకకు సేకరించిన జవాబులతో కూడిన ప్రశ్నా పత్రములలోని జవాబులను దిద్దాలి. విద్యార్థులు పొందిన మార్కులను సంబంధిత రిజిస్టర్లు నందు నమోదు చేయడంతో పాటు, నిర్ణీత సమయం లోపల CSE సైట్ నందు ఎంటర్ చేయాలి. జవాబులతో కూడిన ప్రశ్నా పత్రాలను తనిఖీ అధికారుల పరిశీలనార్థం భద్రపరచాలి.
  • 30. విద్యార్థులు పొందిన మార్కులను ప్రోగ్రెస్ కార్డులందు నమోదుచేసి విద్యార్థుల తల్లిదండ్రులకు పంపాలి. తక్కువ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఉపాధ్యాయులు-తల్లిదండ్రుల సమీక్షా సమావేశంలో FA-III నందు విద్యార్థులు చూపిన ప్రతిభపై చర్చించాలి.


AP SELF ASSESSMENT - I TEST TIME TABLE 


AP SELF ASSESSMENT - I TEST SYLLABUS


AP SELF ASSESSMENT TEST MODEL PAPERS Ist  TO 5th CLASS 2024.


AP SELF ASSESSMENT TEST MODEL PAPERS 6th  TO 10th CLASS 2024.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP SELF ASSESSMENT - I TEST TIME TABLE & SYLLABUS"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0