APEPDCL Recruitment 2024
APEPDCL : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు.వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
APEPDCL Recruitment 2024 : విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL).ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. కార్పొరేట్ ఆఫీస్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన మేనేజర్/ ఐటీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనుంది. ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహణ తేదీని త్వరలో వెల్లడించనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూరించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను https://apeasternpower.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
మొత్తం ఖాళీల సంఖ్య: 05.
మేనేజర్- ఐటీ/ డేటా అనలిటిక్స్: 01 పోస్టు
మేనేజర్- ఐటీ/ డేటా సెంటర్ అడ్మినిస్ట్రేటర్: 01 పోస్టు
మేనేజర్- ఐటీ/ సైబర్ సెక్యూరిటీ: 01 పోస్టు
మేనేజర్- ఐటీ/ శాప్: 01 పోస్టు
మేనేజర్- ఐటీ/ మొబైల్ అప్లికేషన్స్: 01 పోస్టు
ఇతర ముఖ్యమైన సమాచారం :
అర్హత: పోస్టును అనుసరించి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు కనీసం 5-8 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: నోటిఫికేషన్ తేదీ నాటికి 50 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూరించాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీని త్వరలో తెలియజేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: చీఫ్ జనరల్ మేనేజర్/ హెచ్‌ఆర్‌డీ, ఏపీఈపీడీసీఎల్, కార్పొరేట్ కార్యాలయం, సీతమ్మధార, విశాఖపట్నం.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://apeasternpower.com/
0 Response to "APEPDCL Recruitment 2024"
Post a Comment