Bank Holidays List For September 2024
Bank Holidays: బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవులు. సెప్టెంబర్‌లో మొత్తం 15 హాలిడేస్
Bank Holidays List For September 2024: భారతదేశంలో ఏడాది పొడవునా బ్యాంకులకు పుష్కలంగా సెలవులు లభిస్తాయి. వచ్చే నెలలోనూ (సెప్టెంబర్ 2024), వివిధ పండుగలు & సందర్భాలు, రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాల కారణంగా బ్యాంక్లు మొత్తం 15 రోజులు పని చేయవు.
వినాయక చవితి సెలవు సెప్టెంబర్ నెలలో ఉంది. వినాయక చవితి సెప్టెంబర్ 07వ తేదీన శనివారం నాడు వచ్చింది, ఆ వెంటనే ఆదివారం. కాబట్టి బ్యాంక్లు వరుసగా రెండు రోజులు పని చేయవు. అంతేకాదు, ఆ తర్వాతి వారంలో, సెప్టెంబర్ 14వ తేదీన రెండో శనివారం, 15న ఆదివారం, 16న ఈద్ ఉన్నాయి. అంటే.. మూడు రోజులు వరుస సెలవులు వచ్చాయి. బ్యాంక్లకు ఇది లాంగ్ వీకెండ్.
బ్యాంక్ సెలవుల కారణంగా లావాదేవీల విషయంలో ఖాతాదార్లు ఎలాంటి ఇబ్బంది పడకుండా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముందుగానే బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. బ్యాంక్ సెలవులు అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉండవు, ప్రాంతాన్ని బట్టి మారతాయి.
సెప్టెంబర్ నెలలో మీకు బ్యాంక్లో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే, బ్యాంక్ హాలిడేస్ను బట్టి మీ పనిని ప్లాన్ చేసుకోండి. సెలవు సంగతి తెలీకుండా బ్యాంక్కు వెళితే మీ సమయం వృథా అవుతుంది.
సెప్టెంబర్ నెలలో బ్యాంక్ సెలవు రోజులు (Bank Holidays in September 2024):
01 సెప్టెంబర్ 2024, (ఆదివారం) దేశవ్యాప్తంగా బ్యాంక్లకు సెలవు
05 సెప్టెంబర్ 2024, (గురువారం) శ్రీమంత శంకర్దేవ్, హర్తాళికా తీజ్ , అస్సాం, ఛత్తీస్గఢ్, సిక్కిం
07 సెప్టెంబర్ 2024, (శనివారం) వినాయక చవితి దేశవ్యాప్తంగా బ్యాంక్లు పని చేయవు
08 సెప్టెంబర్ 2024, (ఆదివారం) దేశవ్యాప్తంగా బ్యాంక్లకు సెలవు
13 సెప్టెంబర్ 2024, (శుక్రవారం) తేజ దశమి రాజస్థాన్లో బ్యాంక్లకు హాలిడే
14 సెప్టెంబర్ 2024, (శనివారం) రెండో శనివారం + ఓనం పండుగ
15 సెప్టెంబర్ 2024, (ఆదివారం) దేశవ్యాప్తంగా బ్యాంక్లకు సెలవు
16 సెప్టెంబర్ 2024, (సోమవారం) ఈద్ ఇ మిలాద్ దేశవ్యాప్తంగా బ్యాంక్లు పని చేయవు
17 సెప్టెంబర్ 2024, (మంగళవారం) ఇంద్ర జాత్ర సిక్కింలో బ్యాంక్లకు సెలవు ఇస్తారు
18 సెప్టెంబర్ 2024, (బుధవారం) శ్రీ నారాయణ గురు సమాధి కేరళలో బ్యాంక్లకు హాలిడే
21 సెప్టెంబర్ 2024, (శనివారం) శ్రీ నారాయణ గురు సమాధి, ఈ రోజు కూడా కేరళలో బ్యాంక్లకు హాలిడే
22 సెప్టెంబర్ 2024, (ఆదివారం) దేశవ్యాప్తంగా బ్యాంక్లకు సెలవు
23 సెప్టెంబర్ 2024, (సోమవారం) అమరవీరుల దినోత్సవం హరియాణాలో అధికారిక సెలవు
28 సెప్టెంబర్ 2024, (శనివారం) నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంక్లు పని చేయవు
29 సెప్టెంబర్ 2024, (ఆదివారం) దేశవ్యాప్తంగా బ్యాంక్లకు సెలవు
బ్యాంక్లకు సెలవు వస్తే ఒకప్పుడు ఇబ్బంది ఉండేది, ఇప్పుడు కాదు. ప్రస్తుతం లేటెస్ట్ టెక్నాలజీ జనం చేతుల్లోకి వచ్చింది. కాబట్టి, సెలవు రోజుల్లోనూ బ్యాంక్ ట్రాన్జాక్షన్ల విషయంలో ప్రజలు పెద్దగా ఇబ్బంది ఉండడం లేదు. మొబైల్ బ్యాంకింగ్, UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సర్వీస్లు వారంలో ఏడు రోజులూ, రోజులో 24 గంటలూ పని చేస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు సులభంగా మారాయి కాబట్టి బ్యాంక్ సెలవులు నగదు లావాదేవీలపై ప్రభావం చూపడం లేదు. ఒకవేళ, ఆన్లైన్ సేవల్లో ఏదైనా ఇబ్బంది ఉంటే, మీ బ్యాంక్ ముందుగానే మీకు సమాచారం పంపుతుంది.
0 Response to "Bank Holidays List For September 2024"
Post a Comment