Credit card new rules from September 1.
సెప్టెంబర్ 1 నుండి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్.
నేటి కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం అనేది సర్వసాధారణం అయ్యింది. చిన్నాపెద్దా అవసరాలకు, అత్యవసర సమయంలో డబ్బు అప్పు పుట్టకపోతే.. క్రెడిట్ కార్డులని ఉపయోగించి.
అవసరాలు తీర్చుకుంటున్నారు. పైగా నెల రోజుల లోపు డబ్బులు చెల్లిస్తే.. ఎలాంటి ఇంట్రెస్ట్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాడుకున్న మొత్తం ఎక్కువగా ఉంటే.. అప్పుడు దాన్ని ఈఎంఐ కిందకు మార్చుకుని.. ప్రతి నెలా కొంత చెల్లించవచ్చు. కస్టమర్లను ఆకట్టకునేందుకు రకరకాల ఆఫర్లు, కొన్ని రకాల పేమెంట్స్‌పై స్పెషల్ డిస్కౌంట్స్, క్యాష్‌బ్యాక్స్, రివార్డ్ పాయింట్లు వంటి వాటిని ఆఫర్ చేస్తున్నాయి. ఇంకా బిల్లింగ్ సైకిల్ మధ్య గ్యాప్ ఉండటం వంటి కారణాల వల్ల.. చాలా మంది క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారు. అయితే ఇకపై క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా వాడటానికి కూదరదు. సెప్టెంబర్ నుంచి క్రెడిట్ కార్డ్స్ కు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఆ వివరాలు..
సెప్టెంబర్ 1 నుంచి క్రెడిట్ కార్డ్స్ కు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. వీటి గురించి తెలుసుకోకపోతే బెనిఫిట్స్ కోల్పోవడమే కాక అదనంగా ఛార్జీలు కూడా భరించాల్సి వస్తుంది. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు రెండు కూడా తమ క్రెడిట్ కార్డులకు సంబంధించి నియమ నిబంధనలను మార్చినట్లు వెల్లడించాయి. ఈ కొత్త రూల్స్ 2024, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన క్రెడిట్ కార్డులకు సంబంధించిన క్రెడిట్ కార్డు లాయల్టీ ప్రోగ్రామ్‌ను సవరిస్తున్నట్లు ప్రకటించింది. దీని వల్ల యుటిలిటీ ట్రాన్సాక్షన్స్‌పై (కరెంట్, వాటర్, డిష్, పేపర్, ఇంటర్నెట్ బిల్స్) సంపాదించే రివార్డ్ పాయింట్లపై పరిమితి విధించింది. నెలకు ఇప్పుడు 2 వేల వరకు మాత్రమే గరిష్టంగా పాయింట్లు పొందొచ్చు.
యుటిలిటీ ట్రాన్సాక్షన్స్ తో పాటుగా కేబుల్, టెలికాం ట్రాన్సాక్షన్లపై ఆర్జించే.. రివార్డ్ పాయింట్లను కూడా నెలకు 2 వేలకు పరిమితం చేసింది. చెక్, క్రెడ్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చేసే ఎడ్యుకేషనల్ పేమెంట్స్‌కు ఇక మీదట రివార్డ్ పాయింట్స్ రావు. స్కూల్ లేదా కాలేజ్ వెబ్‌సైట్స్ లేదా పీఓఎస్ మెషీన్ల ద్వారా నేరుగా చేసే పేమెంట్స్‌కు మాత్రం రివార్డ్ పాయింట్స్ లభించనున్నాయి. అలానే ఈజీ ఈఎంఐ, వాలెట్ లోడింగ్‌కు సంబంధించిన లావాదేవీలపై ఇకపై కస్టమర్లు రివార్డ్ పాయింట్లు పొందలేరు.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు కూడా క్రెడిట్ కార్డు రూల్స్ మార్చేసింది. ఇక్కడ ప్రత్యేకంగా మినిమం అమౌంట్ డ్యూ, పేమెంట్ డ్యూ డేట్స్‌లో మార్పులు చేసింది. సెప్టెంబర్ స్టేట్మెంట్ నుంచి మినిమం అమౌంట్ డ్యూ, ప్రిన్సిపల్ బ్యాలెన్స్‌లో 5-2 శాతానికి తగ్గుతుంది. అయితే ఇక్కడ ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి రావొచ్చు. ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకుని.. ఫాలో అవ్వకపోతే.. చిక్కులు తప్పవు.
0 Response to "Credit card new rules from September 1."
Post a Comment