Gas price Center is good news for common people.. Gas price will be reduced from September 1.
Gas price సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 1 నుంచి తగ్గనున్న గ్యాస్ ధర.
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు శుభవార్త చెప్పబోతోంది. సెప్టెంబర్ 1న గ్యాస్ సిలిండర్ ధరలతోపాటు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించనున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు ప్రసారమవుతున్నాయి. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇంటి అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.50.. వాణిజ్య సిలిండర్ ధర రూ.60 నుంచి రూ.70 వరకు తగ్గుతుందని నేషనల్ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
కాగా ఆగస్టులో బిజినెస్-గ్రేడ్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధర రూ.8.50 పెరిగింది, జూలైలో రూ.30 తగ్గింది. గతేడాది రాఖీ, ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.300 తగ్గించింది. ఇప్పుడు ధర మరో రూ.50 తగ్గితే.. రూ.760కే అందుబాటులోకి వస్తుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద రాయితీ పొందేవారు రూ.460కే సిలిండర్‌ని ఇంటికి తీసుకెళ్లవచ్చు.
అయితే గ్యాస్ సిలిండర్ ధరతోపాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గనున్నట్లు సమాచారం. పెట్రోల్ లీటర్‌పై రూ.6, డీజిల్ లీటర్‌పై రూ.5 వరకు తగ్గనున్నట్లు మీడియా రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధర లీటర్ రూ.100 దాటగా.. డీజిల్ ధర రూ.90 దాటింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు రేట్లు తక్కువగా ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
0 Response to "Gas price Center is good news for common people.. Gas price will be reduced from September 1."
Post a Comment