Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news for those who use phonePe.. Explanation of how to make payments even if there is no money in the account

 PhonePeవాడే వారికి గుడ్‌న్యూస్‌.. అకౌంట్‌లో డబ్బులు లేకున్నా పేమెంట్స్‌ చేయొచ్చు ఎలానో వివరణ 

Good news for those who use phonePe.. Explanation of how to make payments even if there is no money in the account


నేటి కాలంలో యూపీఐ పేమెంట్స్‌ విపరీతంగా పెరిగాయి. వీటిల్లో గూగుల్‌ పే, ఫోన్‌పే వాడి చేసే పేమెంట్సే అధికం. పట్టణాలు మొదలు గ్రామీణ ప్రాంతాల వరకు ఈ సేవలు విస్తరించాయి

అకౌంట్‌ నంబర్‌ని.. మొబైల్‌ నంబర్‌తో లింకప్‌ చేస్తే సరే.. ఎక్కడైనా పేమెంట్స్‌ చేసేయొచ్చు. కావాల్సిందల్లా నెట్‌ బ్యాలెన్స్‌, మీ బ్యాంక్‌ ఖాతాలో డబ్బులుండటం. ఇదిలా ఉంటే తాజగా ఫోన్‌పే తన కస్టమర్లకు భారీ శుభవార్త చెప్పింది. వారి కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఇక మీరు మీ బ్యాంక్‌ ఖాతాలో డబ్బులు లేకపోయినా పేమెంట్స్‌ చేసేందుకు అవకాశం ఉంది. మరి దీన్ని ఎలా వాడుకోవాలి అనే వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే..


యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఫోన్‌పే తాజాగా కొత్త ఫీచర్ తీసుకువచ్చింది. అదే క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ సేవలు. ఈ కొత్త ఫీచర్‌ వల్ల మీరు ఇకపై మీ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు లేకున్నా పేమెంట్లు చేయొచ్చు. అయితే ఇందుకోసం ముందుగా మీరు మీ బ్యాంక్‌ నుంచి క్రెడిట్ లైన్ సౌకర్యం పొంది ఉండాలి. అప్పుడే ఈ ఫీచర్‌ను వినియోగించుకోవడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీకు గనక క్రెడిట్‌ లైన్‌ సౌకర్యం ఉంటే… దాన్ని ఫోన్‌పేతో లింక్ చేసుకోవచ్చు. తద్వారా ఫోన్‌పే నుంచి క్రెడిట్ లైన్‌తో.. ఖాతాలో నగదు లేకున్నా.. అత్యవసర పేమెంట్స్‌ చేయవచ్చు.


ఈ కొత్త ఫీచర్‌ ద్వారా కస్టమర్లు.. ఖాతాలో డబ్బు లేకున్నా కూడా పేమెంట్స్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా స్వల్ప కాలిక క్రెడిట్‌ ఫెసిలిటీని వినియోగించుకోవచ్చని తాజాగా ఫోన్‌పే వెల్లడించింది. కొత్త ఫీచర్‌ అందుబాటులోకి రావడం వల్ల ఫోన్‌పే వాడేవారికి అదనపు పేమెంట్స్‌ చేసే అవకాశం లభించినట్లైంది. ఈ కొత్త సదుపాయం వల్ల క్రెడిట్‌ వినియోగం బాగా పెరుగుతుందని ఫోన్‌పే పేమెంట్స్ హెడ్ దీప్ అగర్వాల్ తెలిపారు.


ఈ ఫీచర్‌ను వినియోగించుకోవాలంటే..


ఇక ఫోన్‌పే వాడే వారు ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్లాలి.

అక్కడ బ్యాంక్ ఆప్షన్ సెలక్ట్‌ చేసుకోవాలి.

తర్వాత క్రెడిట్ లైన్ ఫెసిలిటీ ఉన్న బ్యాంక్ పేరు సెలక్ట్‌ చేసుకోవాలి.

తర్వాత లింక్ చేసుకుని యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలి.

ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత క్రెడిట్ లైన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది.

పేమెంట్ పేజ్‌లో మీరు దీన్ని చూడవచ్చు.

ఇక ఇటీవలనే కర్నాటక బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ నవి టెక్నాలజీస్ ఈ క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ సేవలు తీసుకువచ్చాయి. దీని వల్ల కస్టమర్లకు ఎంతో మేలు జరుగుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news for those who use phonePe.. Explanation of how to make payments even if there is no money in the account"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0