HLL : ప్రభుత్వరంగ సంస్థ హెచ్ఎల్ఎల్ లైఫ్కర్లో 1121 పోస్టులు.. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక
HLL Lifecare Limited Recruitment 2024 : ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ (HLL Lifecare Limited).. భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన మహారాష్ట్రలో ఉన్న హెచ్‌ఎల్‌ఎల్ (HLL) కేంద్రాల్లో 1121 డయాలసిస్ టెక్నీషియన్ (Dialysis Technician) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 4, 5 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు. వాక్-ఇన్-సెలక్షన్‌కు హాజరు కాలేని అభ్యర్థులు తమ సీవీని hrhincare@lifecarehll.com మెయిల్‌కు సెప్టెంబర్ 7వ తేదీలోగా ఈమెయిల్ చేయాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు నోటిఫికేషన్ లేదా అధికారిక వెబ్‌సైట్ https://www.lifecarehll.com/ చూడొచ్చు.
సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు : 357
డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు : 282
జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు : 264
అసిస్టెంట్ డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు : 218
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో సర్టిఫికేట్ కోర్సు/ డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.08.2024 నాటికి 37 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు అసిస్టెంట్ డయాలసిస్ టెక్నీషియన్‌కు రూ.24,219.. జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్‌కు రూ.29,808.. డయాలసిస్ టెక్నీషియన్‌కు రూ.35,397.. సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్‌కు రూ.53,096.. జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం: వాక్-ఇన్-సెలక్షన్‌కు హాజరు కాలేని అభ్యర్థులు తమ సీవీని hrhincare@lifecarehll.com మెయిల్‌కు సెప్టెంబర్ 7, 2024 తేదీలోగా ఈ-మెయిల్ చేయాలి.
వాక్ ఇన్ సెలక్షన్ తేదీలు: 2024, సెప్టెంబర్ 4, 5 తేదీల్లో ఉంటాయి.
వాక్ ఇన్ సెలక్షన్ వేదిక: పుణె, నాగ్‌పుర్, నాసిక్, షోలాపూర్, నాందేడ్, నవీ ముంబయి, అమరావతి, ఔరంగాబాద్, కొల్హాపూర్, లాతూర్‌లో నిర్వహిస్తారు.
SSC GD Constable Recruitment 2025 : ప్రభుత్వ ఉద్యోగాల (Government Jobs) కోసం సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్. దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 5వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. వాస్తవానికి ఆగస్టు 27న నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. కానీ సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో కానిస్టేబుల్ (SSC GD) నియామకాల ప్రక్రియకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సన్నద్ధమవుతోంది. ఎస్‌ఎస్‌సీ వార్షిక క్యాలెండర్ 2024-25 ప్రకారం.. ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 5వ తేదీతో పూర్తి కానుంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు జరగనున్నాయి. గతేడాది 46,617 ఖాళీల నియామక ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలోనే పోస్టులు ఉండే అవకాశం ఉంది. సుమారు 40 వేల నుంచి 50 వేల మధ్యలో ఖాళీలు ఉండే అవకాశం ఉంది.
0 Response to " "
Post a Comment