Honorable Chief Minister Shri. Nara Chandrababu Naidu's chairmanship of the review of the education department is important.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడుగారి అధ్యక్షత న జరిగిన విద్యాశాఖ సమీక్షలో ని ముఖ్యంశాలు.
విద్యాశాఖ సమీక్షలో ని ముఖ్యంశాలు.
- నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.
- డ్రాప్ అవుట్ సంఖ్య జీరోకు చేరాలి. జీఈఆర్ పెరగాలన్నది లక్ష్యం.
- బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలి.
- కిట్ల పంపిణీలో 2, 3 నెలల ఆలస్యం అయింది. సకాలంలో పంపిణీ చేయడంలో విఫలమైన సంబంధిత ఏజెన్సీని పక్కనబెట్టాలి.
- ఉన్నత విద్యాశాఖలో ఏపీఏఏఆర్(ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) చేస్తే మన రెగ్యులర్ అకాడమిక్ స్కిల్స్ పై ఒక ఐడియా వస్తుంది
- స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరచాలి.
- రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్, టెక్నికల్, యూనివర్సిటీలు, హయ్యన్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్, ఎలిమెంటరీ తదితర విద్యా సంస్థలు ఉన్నాయి. వీటిని భావితరాల భవిష్యత్ కేంద్రాలుగా (ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ సెంటర్స్ గా) తయారుచేయాలి.
- కాలానికనుగుణణంగా కరికులమ్ మార్పు చెందాలి
- ఏపీ విద్యా వ్యవస్థ బెస్ట్ అనేలా విధానాలు ఉండాలి
- అధికారులు ఎప్పటికప్పుడు లక్ష్యాలు నిర్దేశించుకొని సాధనకు కృషి చేయాలి.
- 6 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు పాఠశాలల్లో ఉండాలి. అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న వాళ్లు అంగన్ వాడీల్లో ఉండాలి.
- ప్రస్తుతం పాఠశాలల్లో విజ్ఞాన విహార యాత్రలు లేవు. క్రీడలు లేవు.
- విద్యావ్యవస్థ ధ్వంసం అయ్యింది
- మళ్లీ విజ్ఞాన విహార యాత్రలు, క్రీడలు పాఠశాలల్లో ప్రవేశపెట్టాలి.
- ఒత్తిడిలేని విద్యను అభ్యసించాలి. ఆనందంగా పిల్లలు చదువుకోగలగాలి.
- గతంలో మా హయాంలో ఆన్ లైన్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాం.
- ఇంటరాక్టివ్ విద్యా విధానం తీసుకొచ్చాం. అయినప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న ఉత్తమ విద్యా విధానాలు అవలంభించాలి.
- ఆడియో, వీడియో, ఫీల్డ్ ఎడ్యుకేషన్ విధానం ఎలా ప్రవేశపెట్టాలి అన్న అంశం ఆలోచించాలి.
- విద్యార్థుల్లో స్కిల్స్ మరింత మెరుగుపరచాలి.
- 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పాం.
- వర్క్ స్టేషన్ లు క్రియేట్ చేయాలి.
- ఈ తరహా ఇన్నోవేటివ్ స్కీమ్ లు తీసుకురావాలి. తద్వారా 5-10 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. స్కిల్స్ మెరుగుపరుచుకుంటే అదనపు ఇన్సెంటివ్ లు ఇస్తాం. దేశంలో ఈ తరహా ఎవరూ స్ట్రక్చర్ చేయలేదు.
- వర్చువల్ వర్కింగ్ కి పాలసీ తయారుచేయాలి. 100 మందిని పిలిచి ముందు వర్క్ షాప్ పెడదాం. అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత పాలసీ తయారుచేద్దాం.
- ఆంధ్రప్రదేశ్ ను వర్చువల్ వర్కింగ్ హబ్ గా మారుద్దాం.
- తద్వారా నైపుణ్యాలను మెరుగుపరుచుదాం.
- ఒకప్పుడు మన వాళ్లు అమెరికాకు వెళ్లి పని చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అమెరికా వాళ్లు వచ్చి మన దగ్గర కంపెనీ పెట్టే పరిస్థితి రావాలి.
- విద్యార్థుల మెరుగైన భవిష్యత్ కు బాటలు వేద్దాం.
- గ్రామ సచివాలయం ద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల వివరాలు వెలికితీయాలి. ఎంత మంది వర్క్ చేస్తున్నారన్న వివరాలు సేకరించాలి.
- ఎంప్లాయిమెంట్ అనేది అన్ని ప్రాంతాలకు విస్తరించాలి.
- డిజిటల్ కరెన్సీ వచ్చిన సమయంలో యూపీఐ, క్యూఆర్ కోడ్ తెచ్చాం.
- ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ప్లాట్ ఫామ్ అనేది యూపీఐ మాదిరి ప్లాట్ ఫామ్ వస్తే ఒకే వేదిక పైకి ఉత్పత్తిదారులు, వినియోగదారులు తీసుకొస్తాం. మిగిలిన వారిని కూడా ఒకే వేదిక పైకి తీసుకురాగలిగితే ఏం కావాలన్నా ఆన్ లైన్ లో కొనగలుగుతాం. అదే విధంగా ఉత్పత్తి చేసిన వస్తువును అమ్ముకునే వీలు కలుగుతుంది. ఉదాహరణకు అగ్రి కల్చర్ ప్రొడక్ట్స్, హ్యాండీక్రాఫ్ట్ తదితర వస్తువులను అంతర్జాతీయ స్థాయిలో అమ్ముకునే అవకాశం ఉంది. ఇదే భవిష్యత్తు కాబోతుంది. దీనిపై కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది.
0 Response to "Honorable Chief Minister Shri. Nara Chandrababu Naidu's chairmanship of the review of the education department is important."
Post a Comment