Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Kendra good news..free gas cylinder, stove. Procedure to Apply

 Free Gas: కేంద్రం శుభవార్త..ఉచితంగా గ్యాస్ సిలిండర్, స్టవ్. అప్లై చేసుకొనే విధానం.

Kendra good news..free gas cylinder, stove. Procedure to Apply

సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాల్ని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.

మరీ ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల వారిని ఆదుకోవడం కోసం, వారి పడే ఇబ్బందులను తొలగించడం కోసం.. ఆర్థికంగా పైకి రావడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక స్కీమ్ లను అమలు చేస్తోంది. ఇక తాజాగా ఇలాంటి ఓ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. దీనిలో భాగంగా ఉచితంగా గ్యాస్ సిలిండర్, స్టవ్ పొందేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇంతకు ఇది ఏ పథకం.. దీనికి ఎవరు అర్హులు.ఎలా అప్లై చేసుకోవాలంటే.

మహిళల వంటింటి కష్టాలు తీర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా గ్యాస్ సిలిండర్, స్టవ్ ఉచితంగానే వస్తుంది. ఇంకా వీటిపై సబ్సిడీ కూడా ఉంటుంది. ఈ పథకానికి అర్హులైన వారు.. ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్ల వరకు పొందవచ్చు. వీటి మీద రూ. 300 చొప్పున రాయితీ (సబ్సిడీ) కూడా అందిస్తుంది. ఇప్పటికే ఈ స్కీమ్ కింద 10 కోట్ల 33 లక్షలకుపైగా కుటుంబాలు లబ్ధి పొందాయి అని అధికారులు తెలిపారు.

ఫ్రీ గ్యాస్, స్టవ్ పొందాలంటే..

ఆర్థికంగా వెనుకబడిన వారిక, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు.

18 ఏళ్లు దాటిన మహిళలకు ఈ స్కీం కోసం అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తుదారి కుటుంబ వార్షిక ఆదాయం లక్ష లోపు ఉండాలి.

ఇప్పటివరకు ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఉండొద్దు.

బ్యాంక్ అకౌంట్ ఉండాలి.

కుటుంబ సభ్యుల రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అవసరం.

పథకంలో భాగంగా మీరు ఏ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌నైనా ఎంచుకోవచ్చు.

అప్లై చేయు విధానం 

  • ఈ పథకం కోసం అప్లై చేసుకోవాలంటే ముందుగా ఈ వెబ్‌సైట్‌కువెళ్లాలి.
  • అక్కడ కొత్త కనెక్షన్ అనే ఆప్షన్ వస్తుంది.. దానిపై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత మీ ప్రాంతంలో ఎక్కువగా ఉండే ఏదైనా డిస్ట్రిబ్యూటర్‌ను ఎంచుకోవాలి (ఇండేన్/హెచ్‌పీ గ్యాస్/భారత్ గ్యాస్).
  • తర్వాత రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత కస్టమర్ పేరు, మొబైల్ నంబర్, ఇ- మెయిల్, క్యాప్చా కోడ్ సహా ఇతర వివరాలు నమోదు చేయాలి.
  • స్క్రీన్‌పై ఒక అప్లికేషన్ ఫారం ఉంటుంది.
  • దానిని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీస్కొని వివరాలు నింపాలి.
  • ఆ తర్వాత దానిని సదరు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్‌కు అందించాల్సి ఉంటుంది.
  • తర్వాత మీ వివరాలు ధ్రువీకరించి కనెక్షన్ ఇస్తారు.
  • ఉజ్వల స్కీమ్ కింద మొదట స్టవ్, సిలిండర్ ఫ్రీగానే వస్తుంది.
  • తర్వాతి నుంచి గ్యాస్ సిలిండర్‌పై రూ. 300 సబ్సిడీ వస్తుంది.
  • ఏటా 12 సిలిండర్లపై రాయితీ వర్తిస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Kendra good news..free gas cylinder, stove. Procedure to Apply"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0