New Pension Scheme
New Pension Scheme : కొత్త పెన్షన్ స్కీం తీసుకొచ్చిన కేంద్రం.. అర్ధరాత్రి నుంచే అమలు వృద్ధ దంపతులకు ఏడాదికి 72000
కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీం ను ప్రవేశ పెట్టింది. ప్రధాన మంత్రి శ్రమ యోగి మన్ ధన్ కార్యక్రమం ద్వారా మంచి రాబడితో పాటు ఇన్వెస్ట్ మెంట్ భద్రతను అందించే పథకంగా ఉంది.
పదవీ విరమణ చేస్తే ఇక అందరు ఇతరుల మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఆ టైం లో ఆదాయం ఉండదు. అందుకే ప్రతి ఒక్కరు పదవీ విరమణ ప్రణాళిక గురించి ఆలోచిస్తారు. ఐతే ఉద్యోగులు మాత్రం పదవీ విరమణ తర్వాత ఖచ్చితంగా ఇతరుల మీద ఆధారపడతారు. ఆదాయం లేకపోవడం వల్ల కొన్ని నిత్యావసరాలను తీర్చుకోలేరు. వైద్య అవసరాల తీరడం లేదు. అందుకే నెలకు కొద్దిపాటి పెట్టుబడి తో అలాంటి వారికి భరోసా కల్పించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ స్క్రీం తీసుకొచ్చింది.
దేశంలో కార్మికులకు ఆర్ధిక భద్రత కల్పించేందుకు కొన్ని ఏళ్ల క్రితం మోడీ ప్రభుత్వం ఏదో ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. కార్మిక ఇంకా ఉపాధి మంత్రిత్వ శాఖ 2019 లో పీ ఎం శ్రమ యోగి మన్ ధన్ ను మొదలు పెట్టింది. ఈ పథకం ద్వారా వృద్దాప్యం లో ఉన్న వారికి 200 కంటే తక్కువ పెట్టి వివాహిత జంటలకు ఏడాదికి 72000 వార్షిక పెన్షన్ ను అందిస్తుంది. పీఎం శ్రమ యోగి మాన్ ధన్ యోజన ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, నేత కార్మికులు, ఇటుక బట్టీలు, వ్యవసాయ కార్మికులు, బీడీ కార్మికులు, గృహ కార్మికులు, వీధి వ్యాపారులు, తోలు కార్మికులు, క్యాంటీన్ కార్మికులు, లోడర్లు, చెప్పులు కుట్టే కార్మికులు, రిక్షా పుల్లర్లు, భూమిలేని కార్మికులు, కూలీలు ఆడియో విజువల్ కార్మికులు మరియు నెలవారీ కార్మికులు వస్తారు. ఆదాయం 15,000 రూపాయలు లేదా అంతకంటే తక్కువ ఉన్న వారికి ఏజ్ 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల ఇతర వృత్తులు ఈ పథకానికి అర్హులు.
100 రూపాయల పెట్టుబడితో.. దంపతులు ఇదరు 100 రూపాయలు నెలకు చెల్లించి 72000 పెన్షన్ పొందవచ్చు. ఏడాదికి 1200 అయితే 60 ఏళ్ల తర్వాత 36000 పెన్షన్ అంటే జంటకు 72000 అందిస్తారు. గ్యారెంటీడ్ పెన్షన్.. పీఎం మాన్ ధన్ యోజన 60 ఏళ్లు వచ్చిన తర్వాత ప్రతి దరఖాస్తు దారులు 3000 కనీస హామె పెన్షన్ పొందుతారు. దరఖాస్తు దారులు తప్పనిసరిగ మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంక్ సేవింగ్ అకౌంట్ కలిగి ఉండాలి. అర్హత కలిగిన చందాదారులు స్వీయ ధృవీకరణ ఆధారంగా ఆధార్ నంబర్, సేవింగ్ ఖాతా, జన్ ధన్ ఖాత నంబర్ నమోదు చేయడం ద్వారా దగ్గర్లో ఉన్న సీ.ఎస్.సీలను సందర్శించి దీనికి అప్లై చేయొచ్చు.
0 Response to "New Pension Scheme"
Post a Comment