Paralysis that comes regardless of age.. No danger if you take these precautions
వయసుతో సంబంధం లేకుండా వస్తున్న పక్షవాతం.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే నో డేంజర్
నేటి ఆధునిక జీవితం మనిషిని యంత్రం కంటే ఎక్కువగా పనిచేసేవిధంగా చేస్తోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు అన్నీ కలిపి మానవుని కాల చక్రాన్ని గతితప్పేలా చేస్తున్నాయి.
దాంతో మనిషి క్రమంగా మానసిక, శారీరక ఒత్తిడికి చిత్తై, అనారోగ్యం బారినపడుతున్నాడు. ఇక ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా వస్తున్న జబ్బు పక్షవాతం. ఇది వస్తే చెట్టంత మనిషి కూడా మంచం పట్టాల్సిందే. అయితే పక్షవాతం లక్షణాలను ముందే గుర్తించి, ఈ జాగ్రత్తలు తీసుకుంటే నో డేంజర్ అంటున్నారు డాక్టర్లు. మరి ఆ లక్షణాలు, ముందు తీసుకునే జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పక్షవాతం లక్షణాలు
- పక్షవాత లక్షణాలలో ముఖ్యమైనది హఠాత్తుగా తిమ్మిర్లు పట్టడం లేదా బహీనంగా మారడం.
- ఇక చేయి, కాలు ఒకవైపునకు లాగుతుంటే కూడా పక్షవాత లక్షణంగా భావించవచ్చు.
- సాధారణంగా మాట్లాడే వ్యక్తికి ఒకేసారి నత్తిపోవడం, మాటలు అస్పష్టంగా మాట్లాడటం.
- ఉన్నట్లుండి గందరగోళం, దిక్కుతోచని స్థితిలో చెప్పిన విషయాలను అర్థం చేసుకోకపోవడం.
- అనుకోకుండా తీవ్రమైన తలనొప్పి రావడం. ఇది హెమరేజిక్ స్ట్రోక్ కు సంకేతంగా భావించాలి.
- కంటిచూపులో సమస్యలు, ఒక వస్తువు డబుల్ గా కనిపించడం, మైకంగా ఉండటం.
- నడవడంలో ఇబ్బంది. అడుగులు సరిగ్గా వేయకపోవడం. బ్యాలెన్స్ తప్పడం.
- పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదిస్తే.. మీకు నో డేంజర్ అన్నట్లే.
పక్షవాతానికి చికిత్స
నేటి టెక్నాలజీ యుగంలో పక్షవాతానికి అద్భుతమైన చికిత్సలు లభిస్తున్నాయి. ఆయుర్వేదంలో కూడా ఈ వ్యాధికి గొప్ప చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా పక్షవాతానికి ఫిజికల్ థెరపీని ఉపయోగిస్తారు. దాంతో పాటుగా నరాలు, కండరాలను యాక్టివేట్ చేయడానికి హీట్ మసాజ్ అండ్ ఫిజియోథెరపీ, ఎక్సర్ సైజ్ లు చేపిస్తారు. అయితే రోగికి హెల్ప్ చేయడానికి కొన్ని సందర్బాల్లో ఫంక్షనల్ ఎలక్ట్రిక్ స్టిమ్యూలేషన్ ఉపయోగిస్తారు. వీటితో పాటుగా మరికొన్ని ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
పక్షవాతం రాకుండా తీసుకునే జాగ్రత్తలు
- అధిక రక్తపోటుతో పక్షవాతం వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి.
- గుండె సమస్యల కారణంగా పెరాలసిస్ వచ్చే ఛాన్స్ లు 5 రెట్లు ఎక్కువగా ఉంటాయి.
- ఒకవేళ గుండెలయ అస్తవ్యస్తమయ్యే సమస్య(ఏట్రియల్ ఫిబ్రిలేషన్) ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
- ఒత్తిడి పెరగడం కూడా పక్షవాతానికి దారితీస్తుంది. కాబట్టి దాన్ని మీ దరిచేరకుడా చూసుకోండి.
- మధుమేహంతో బాధపడే వారికి పెరాలసిస్ ముప్పు 1.5 రెట్లు ఎక్కువని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే శరీరంలో గ్లూకోజ్ ను నియంత్రణలో ఉంచాలి.
- అధిక బరువును తగ్గించాలి, ఇక ఆహారంలో పీచు పదార్థాలను పెంచాలి.
- బీడీలు, సిగరెట్లు, చుట్టలు కాల్చేవారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. స్మోకింగ్ ను పూర్తిగా మానేయాలి.
- పై జాగ్రత్తలతో పాటుగా చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించి, రోజూ వ్యాయామం చేయడం ద్వారా పెరాలసిస్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
0 Response to "Paralysis that comes regardless of age.. No danger if you take these precautions"
Post a Comment