Railway Recruitment Board JE Recruitment Notification
RRB JE Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 7951 'రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తు ప్రారంభం.
RRB JE Recruitment 2024 Notification: రైల్వేశాఖలో జూనియర్ ఇంజినీర్, ఇతర ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జులై 30 నుంచి ఆగస్టు 29 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు
Railway Recruitment Board JE Recruitment Notification: దేశంలోని నిరుద్యోగులకు రైల్వేశాఖ తీపి కబురు వినిపించింది. రైల్వేశాఖ పరిధిలోని వివిధ జోన్లలో 7,951 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా కెమికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్, జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ ఉద్యోగాలకు డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, బీఎస్సీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 30 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు ఆగస్టు 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. రెండు దశల రాతపరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్యపరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
మొత్తం ఖాళీల సంఖ్య: 7,951.
జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్: 7,934 పోస్టులు
కెమికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ (ఆర్‌ఆర్‌బీ గోరఖ్‌పూర్ మాత్రమే): 17 పోస్టులు
అర్హత: పోస్టులవారీగాసంబంధిత విభాగంలో డిప్లొమా (ఇంజినీరింగ్), బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ), బీఎస్సీ (సివిల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.01.2025 నాటికి 18-36 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10- 15 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ మహిళలు/ ట్రాన్స్‌జెండర్లకు రూ.250.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2 కంప్యూటర్ బేస్డ్ టెస్టులు(CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్టేజ్-1 రాతపరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు స్టేజ్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు-30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 15 ప్రశ్నలు-15 మార్కులు, జనరల్ సైన్స్ 30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.
స్టేజ్-2 రాతపరీక్ష విధానం: మొత్తం 150 మార్కులకు స్టేజ్-2 రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో జనరల్ అవేర్‌నెస్ 15 ప్రశ్నలు-15 మార్కులు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15 ప్రశ్నలు-15 మార్కులు, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 10 ప్రశ్నలు-10 మార్కులు, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10 ప్రశ్నలు-10 మార్కులు, టెక్నికల్ ఎబిలిటీస్ 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.
జీతం:
జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్: రూ.35,400.
కెమికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్‌వైజర్/ రిసెర్చ్: రూ.44,900.
ముఖ్యమైన తేదీలు.
- ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రారంభం: 30.07.2024.
- ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 29.08.2024.
- దరఖాస్తు సవరణ తేదీలు: 30.08.2024 నుంచి 08.09.2024 వరకు.
WEBSITE : https://rrbsecunderabad.gov.in/
0 Response to "Railway Recruitment Board JE Recruitment Notification"
Post a Comment