Raksha Bandhan 2024
Raksha Bandhan 2024: రాఖీ కట్టే సమయం.. ముహూర్తం వివరాలు.
రక్షాబంధన్ (Raksha Bandhan) అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమకు ప్రతీకగా ఉండే పండుగ. ఈ ఏడాది ( 2024) ఆగస్టు 19 సోమవారం వచ్చింది. అన్నాచెల్లెళ్ల మధ్య బంధం (Brother & Sister Relationship) చెక్కు చెదరకుండా ఉండాలంటే శుభ ముహూర్తంలో మాత్రమే రాఖీ కట్టాలి.
ఈ ఏడాది రక్షాబంధన్(రాఖీ ) శుభముహూర్తం ఏ సమయంలో కట్టాలో తెలుసుకుందాం.
శ్రావణ మాసం వ్రతాలు, పూజలు, పెళ్ళిళ్ళకే కాదు.. అన్నా చెల్లెళ్లకు, అక్కా తమ్ములకు కూడా చాలా ప్రత్యేకమైన మాసం. శ్రావణ పూర్ణిమ రోజే రాఖీ పూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజు అక్కా చెల్లెళ్లు తమ సోదరులకు రక్షగా, వారు ఎప్పుడూ సంతోషంగా, క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాఖీని కడతారు. అయితే రాఖీ కట్టడానికి ఒక నిర్దేశిత సమయం ఉంది. రాఖీ పౌర్ణమి రోజు వచ్చే భధ్రకాలాన్ని ఆ రోజు పరిగణలోకి తీసుకుంటారు. భద్రుని నీడ ఉన్న సమయంలో రాఖీ కట్టకూడదని అంటారు.
ఈ ఏడాది రక్షాబంధన్‌పై భద్ర ఛాయలు కమ్ముకుంటున్నాయి. రాఖీ రోజున సోదరీమణులు సోదరుడి రాఖీ కట్టి అతని ఉజ్వల భవిష్యత్తును కోరుకుంటారు. రాఖీ (Rakhi) కట్టిన తర్వాత సోదరుడు సోదరికి ఎల్లప్పుడూ రక్షిస్తానని హామీ ఇస్తాడు.
రక్షాబంధన్ తేదీ:
పంచాంగ్ ప్రకారం.. ఈ సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి ఆగస్టు 19 సోమవారం తెల్లవారుజామున 03:04 నుంచి ప్రారంభమవుతుంది. ఈ తేదీ ఆగస్టు 19 రాత్రి 11:55 గంటలకు ముగుస్తుంది. శ్రావణ పూర్ణిమ నాడు రక్షాబంధన్ జరుపుకుంటారు.
అనుకూల సమయం.
ఈ సంవత్సరం రక్షాబంధన్ నాడు ఆగస్ట్ 19న మధ్యాహ్నం 2:07 నుంచి రాత్రి 08:20 వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం. ప్రదోష కాలంలో సాయంత్రం 06.57 నుంచి 09.10 గంటల వరకు రాఖీ కట్టడం శుభప్రదం. అయితే రక్షాబంధన్ పండుగను ఉదయం పూట జరుపుకునే వారు ఈ సారి ఉదయం నుంచి మధ్యాహ్నం 01.32 గంటల వరకు రాఖీ కట్టలేరు. ఈ సమయంలో భద్రుడు ఉంటాడు.
భద్రకాలం ఎప్పటి వరకు ఉంటుంది.
రక్షాబంధన్ నాడు ఉదయం 5:53 గంటలకు భద్ర ప్రారంభ సమయం. ఆ తర్వాత మధ్యాహ్నం 1:32 వరకు కొనసాగుతుంది. ఈ భద్ర పాతాళలోకంలో ఉంటాడు. రక్షాబంధన్ సమయంలో రాఖీ కట్టే ముందు భద్ర కాలాన్ని ఖచ్చితంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది అశుభకరమైనదిగా చెబుతారు.
భద్రకాలంలో రాఖీ కట్టడం అశుభం
పురాణాల ప్రకారం.. రక్షాబంధన్ పండుగను భద్రకాలంలో జరుపుకోకూడదు అనేది భద్ర కాలంలో రాఖీ కట్టడం శ్రేయస్కరం కాదు. భద్ర కాలంలో లంక పాలకుడు రావణుడికి అతని సోదరి రాఖీ కట్టింది. అదే సంవత్సరంలో రాముడి చేతిలో రావణుడు చంపబడ్డాడు. అందుకే భద్ర కాలంలో రాఖీ కట్టారని పండితులు చెబుతున్నారు.
రక్షాబంధన్ ప్రాముఖ్యత
ప్రతికూలత, దురదృష్టం నుంచి రక్షించడానికి రక్షాబంధన్ ముడిపడి ఉంది. రక్షాబంధన్ ధరించిన వారి ఆలోచనలు సానుకూలంగా, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. రక్షాబంధన్ ఇప్పుడు రాఖీ రూపంలోకి వచ్చినప్పటికీ దాని ఉద్దేశ్యం అన్నాచెల్లెళ్ల బంధాన్ని బలంగా ఉంచుతుందని నమ్ముతారు.
0 Response to "Raksha Bandhan 2024"
Post a Comment