Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

RRB Railway Jobs

 RRB Railway Jobs: ఇంటర్, డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 

RRB Railway Jobs

భారత రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ రైల్వే రీజియన్లలో పారామెడికల్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1,376 పారా మెడికల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎంపికైన వారికి హ్మదాబాద్, చెన్నై, ముజఫర్‌పూర్, అజ్‌మేర్, గోరఖ్‌పూర్, పట్నా, బెంగళూరు, గువాహటి, ప్రయాగ్‌రాజ్, భోపాల్, జమ్ము- శ్రీనగర్, రాంచీ, భువనేశ్వర్, కోల్‌కతా, సికింద్రాబాద్, బిలాస్‌పూర్, మాల్దా, సిలిగురి, ముంబయి, తిరువనంతపురం.. రైల్వే రీజియన్లలో పోస్టింగ్‌ ఇస్తారు.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు 

డైటీషియన్ (లెవల్-7) పోస్టుల సంఖ్య: 05

నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టుల సంఖ్య: 713

అడియాలజిస్ట్ అండ్‌ స్పీచ్ థెరపిస్ట్ పోస్టుల సంఖ్య: 04

క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టుల సంఖ్య: 07

డెంటల్ హైజీనిస్ట్ పోస్టుల సంఖ్య: 03

డయాలసిస్ టెక్నీషియన్ పోస్టుల సంఖ్య: 20

హెల్త్ అండ్‌ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్‌-III పోస్టుల సంఖ్య: 126

ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ పోస్టుల సంఖ్య: 27

పెర్ఫ్యూషనిస్ట్ పోస్టుల సంఖ్య: 02

ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్-II పోస్టుల సంఖ్య: 20

ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్టుల సంఖ్య: 02

క్యాథ్‌ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టుల సంఖ్య: 02

ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్) పోస్టుల సంఖ్య: 246

రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్ పోస్టుల సంఖ్య: 64

స్పీచ్ థెరపిస్ట్ పోస్టుల సంఖ్య: 01

కార్డియాక్ టెక్నీషియన్ పోస్టుల సంఖ్య: 04

ఆప్టోమెట్రిస్ట్ పోస్టుల సంఖ్య: 04

ఈసీజీ టెక్నీషియన్ పోస్టుల సంఖ్య: 13

ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-II పోస్టుల సంఖ్య: 94

ఫీల్డ్ వర్కర్ పోస్టుల సంఖ్య: 19

పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్‌/ జీఎన్‌ఎం/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ పీజీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి కలిగిన వారు  26. 09.2024 తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, ఈబీసీలకు రూ.250, ఇతరులకు రూ.500 చొప్పున చెల్లించాలి. సీబీటీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), రూల్ ఆఫ్‌ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

రైల్వే పారా మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ 2024

1376 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల

 17.08.24 నుంచి దరఖాస్తులు ప్రారంభం

16.09.24 దరఖాస్తులకు చివరితేది

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, జీఎన్‌ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, ఈబీసీలకు రూ.250. ఇతరులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: సీబీటీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), రూల్ ఆఫ్‌ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష సబ్జెక్టులు: ప్రొఫెషనల్ ఎబిలిటీ (70 ప్రశ్నలు- 70 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (10 ప్రశ్నలు- 10 మార్కులు), జనరల్ అరిథ్‌మెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (10 ప్రశ్నలు- 10 మార్కులు), జనరల్ సైన్స్ (10 ప్రశ్నలు- 10 మార్కులు). మొత్తం మార్కులు 100లకు ఉంటుంది. పరీక్ష సమయం.. 90 నిమిషాల వ్యవధి ఉంటుంది.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

రాత పరీక్ష తేదీలు.

రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ప్రొఫెషనల్ ఎబిలిటీ విభాగంలో 70 ప్రశ్నలకు 70 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ విభాగంలో 10 ప్రశ్నలలకు 10 మార్కులు, జనరల్ అరిథ్‌మెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగాల్లో 10 ప్రశ్నలకు 10 మార్కులు, జనరల్ సైన్స్ విభాగంలో 10 ప్రశ్నలకు 10 మార్కుల చొప్పున అడుగుతారు. 90 నిమిషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తులు ప్రారంభ తేదీ:  17.08.2024

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ:16.09.2024 

దరఖాస్తు సవరణ తేదీలు: 17.09.2024 నుంచి 27.09.2024

అధికారిక వెబ్సైటు! https://www.rrbapply.gov.in/#/auth/landing


NOTIFICATION



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "RRB Railway Jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0