Tirumala Tirupati Devasthanams
TTD : తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగ ప్రకటన.. ఈనెల 29న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహణ
Tirumala Tirupati Devasthanams : టీటీడీలో ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన విడుదల చేశారు. టీటీడీ (TTD Temple) ఆధ్వర్యంలోని ఆస్పత్రులు, డిస్పెన్సరీల్లో ఒక సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ (Civil Assistant Surgeons) (BC-B(W) -01, ST (W) – 01, BC-B -01, SC -01, BC-D(W)- 01) ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 5 పోస్టులు ఉన్నాయని టీటీడీ తెలిపింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంబీబీఎస్ విద్యార్హత గల అభ్యర్థుల కోసం ఆగష్టు 29వ తేదీన వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
తిరుపతి టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని సెంట్రల్ హాస్పిటల్‌లో ఆగస్టు 29వ తేదీన ఉదయం 11 గంటలకు వాక్-ఇన్-ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ధ్రువపత్రాల ఒరిజినల్ , జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు https://www.tirumala.org/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్స్ విభాగంలో చూడొచ్చు. అలాగే.. కార్యాలయ పని వేళల్లో 0877-2264371 సంప్రదించవచ్చని టీటీడీ సూచించింది.
0 Response to "Tirumala Tirupati Devasthanams"
Post a Comment