Airport jobs with 10th Class Qualifiction
Airport jobs with 10th Class Qualifiction: 10వ తరగతి అర్హతతో ఎయిర్ పోర్ట్‌లో భారీగా ఉద్యోగాలు.
ఎయిర్ ఇండియా ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (AIASL) నుండి పదో తరగతి, డిప్లమా వంటి అర్హతలతో 208 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.
AIASL విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గలవారు స్వయంగా ఇంటర్వ్యూకి హాజరయ్యి ఎంపిక కావచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు , ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము మరియు మరికొన్ని ముఖ్యమైన వివరాలు..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : AIASL
భర్తీ చేస్తున్న పోస్టులు : ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్ కం రాంప్ డ్రైవర్, హ్యాండీ మ్యాన్ లేదా హ్యాండీ ఉమెన్ అనే ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య : 208
ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 03
యుటిలిటీ ఏజెంట్ కం రాంప్ డ్రైవర్ - 04
హ్యాండీ మ్యాన్ లేదా హ్యాండీ ఉమెన్ - 201
జీతము :
ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ - 24,960/-
యుటిలిటీ ఏజెంట్ కం రాంప్ డ్రైవర్ - 21,270/-
హ్యాండీ మ్యాన్ లేదా హ్యాండీ ఉమెన్ - 18,840/-
విద్యార్హత :
ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు సంబంధిత బ్రాంచ్ లలో ఐటిఐ లేదా డిప్లమో పూర్తి చేసి ఉండాలి. ఇంటర్వ్యూ కి వెళ్లే అభ్యర్థులు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పట్టుకుని వెళ్లి ట్రేడ్ టెస్ట్ కు హాజరు కావాలి.
యుటిలిటీ ఏజెంట్ కం రాంప్ డ్రైవర్ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత ఉండాలి. ట్రేడ్ టెస్ట్ కు హాజరయ్యేటప్పుడు హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ పట్టుకొని వెళ్ళాలి.
హ్యాండీ మ్యాన్ లేదా హ్యాండీ ఉమెన్ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత ఉండి ఇంగ్లీష్ చదవడం అర్థం చేసుకోవడం వచ్చి ఉండాలి. స్థానిక హిందీ భాష పై నాలెడ్జ్ ఉండాలి.
కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు
గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి గరిష్టంగా 28 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారు అప్లై చేసుకునే రకంగా ఉద్యోగాలు ఉన్నాయి.
వయస్సులో సడలింపు : క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.
SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు 500/-
ఇంటర్వ్యూ తేదీ :
రామ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ మరియు యుటిలిటీ ఏజెంట్ కం ర్యాంప్ డ్రైవర్ ఉద్యోగాలకు అక్టోబర్ 5వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
హ్యాండీ మ్యాన్ లేదా హ్యాండీ ఉమెన్ ఉద్యోగాలకు అక్టోబర్ 7వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
అప్లికేషన్ విధానం :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
ఇంటర్వ్యూ జరిగే చిరునామా : Sri Jagannath Auditorium, Near Vengoor Durga Devi Temple, Vengoor, Angamaly, Ernakulam, Kerala, Pin - 683572.
ఎంపిక విధానం: అభ్యర్థులను ఇంటర్వ్యూ ట్రేడ్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి వాటి ఆధారంగా ఎంపిక చేస్తారు.
0 Response to "Airport jobs with 10th Class Qualifiction"
Post a Comment