AP 'TET' candidates are getting alert, hall tickets - Downloading from when?
APTET 2024: ఏపీ 'టెట్' అభ్యర్థులకు అలర్ట్, హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్- డౌన్‌లోడింగ్ ఎప్పటినుంచంటే?
ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(APTET-2024)కు సంబంధించిన పాఠశాల విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. టెట్ పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను సెప్టెంబరు 22 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రంలో అక్టోబర్ 3 నుంచి 20 వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్న 'టెట్' పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్లో, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు
సెప్టెంబర్ 19 నుంచి మాక్ టెస్టులు..
టెట్ పరీక్ష కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థుల సౌలభ్యం కోసం సెప్టెంబర్ 19 నుంచి మాక్ టెస్టులను విద్యాశాఖ అందుబాటులో ఉంచనుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీలు మాత్రం పరీక్ష నిర్వహించిన మరుసటి రోజు నుంచి అంటే.. అక్టోబర్ 4 నుంచి విడుదల చేస్తారు. అక్టోబర్ 5 నుంచి కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇక అక్టోబర్ 27న ఫైనల్ ఆన్సర్ ‘కీ’ విడుదల చేసి, నవంబర్ 2న ఫలితాలను ప్రకటించనున్నారు.
పరీక్ష విధానం:
- ఒక్కో పేపరుకు 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం 2.30 గంటలు.
- పేపర్-1 ఎలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్మెంటల్ సైన్స్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.
- పేపర్-1 బిలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్మెంటల్ సైన్స్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.
- పేపర్-2 ఎలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్/బయాలజీ/ఫిజిక్స్/సోషల్ స్టడీస్/లాంగ్వేజ్-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.
- పేపర్-2 బిలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, కేటగిరీ ఆఫ్ డిజెబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగోగి -60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.
కేటగిరీలవారీగా అర్హత మార్కులు..
ఏపీ టెట్ పరీక్షలో అర్హత మార్కులను ఓసీ(జనరల్) అభ్యర్థులకు- 60 శాతంగా, బీసీ అభ్యర్థులకు- 50 శాతంగా, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్/ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు 40 శాతంగా నిర్ణయించారు.
ముఖ్యమైన తేదీలు.
- ఆన్లైన్ మాక్ టెస్టులు అందుబాటులో: 19.09.2024 నుంచి.
- టెట్ హాల్టికెట్ల డౌన్లోడ్: 22.09.2024 నుంచి
- టెట్ పరీక్ష షెడ్యూలు: 03.10.2024 - 20.10.2024. రెండు సెషన్లలో{పేపర్-1(ఎ) & పేపర్-1(బి), పేపర్-2(ఎ) & పేపర్-2(బి)}
- టెట్ ప్రాథమిక 'కీ' విడుదల: 04.10.2024 నుంచి,
- ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 05.10.2024 నుంచి.
- టెట్ ఫైనల్ కీ విడుదల: 27.10.2024.
- టెట్ ఫలితాల వెల్లడి: 02.11.2024.
0 Response to "AP 'TET' candidates are getting alert, hall tickets - Downloading from when?"
Post a Comment