Good news for dSC candidates
DSC అభ్యర్థులకు గుడ్ న్యూస్..చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు(DSC) గుడ్ న్యూస్ చెప్పింది. అర్హత(Qualification) కలిగి ఉన్నత చదువులు, ప్రభుత్వ ఉద్యోగాలు(Govt Jobs) సాధించాలని పట్టుదలతో ఉన్న వారికి ఉచిత ట్రైనింగ్ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గిరిజన అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ(DSC) శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏజేన్సీ ప్రాంతాల్లోని 6 ఐటీడీఏ(ITDA)ల్లో, గిరిజనేతరుల ప్రాంతాల్లో రెండు లేదా మూడు సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఒక్కో కేంద్రంలో 150 మందికి శిక్షణ ఇస్తారు. మూడు నెలల పాటు సాగే ఈ శిక్షణకు(Training) ఒక్కో అభ్యర్థికి రూ.25 వేల వరకు ఖర్చు చేయనుంది. కాగా 16,347 పోస్టులను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్న నేపథ్యంలో ఈ ఉచిత శిక్షణకు సంబంధించిన తేదీలను అధికారికంగా ప్రకటించలేదు.
0 Response to "Good news for dSC candidates"
Post a Comment