Indian Navy SSC 250 Vacancies Notification Out! Apply here
మహిళా, పురుషులకు ఉద్యోగ అవకాశాలు.. భారీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. Indian Navy SSC 250 Vacancies Notification Out! Apply here
భారతీయ మహిళా పురుష అభ్యర్థులకు శుభవార్త!
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ చెందిన ఇండియన్ నేవీ, అవివాహిత మహిళ పురుష అభ్యర్థుల నుండి జూన్ 2025న ప్రారంభం కాబోతున్న (కోర్స్ 25) షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ సూపర్ నోటిఫికేషన్ జారీచేసింది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని మరియు దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలు అర్హత ప్రమాణాలు కలిగి ఉండాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ..
సూచన :: https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టువివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 250.
విభాగాల వారీగా/ పోస్టుల వారీగా కాళీలా కోసం అధికారిక నోటిఫికేషన్ చదవగలరు .
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ ఇంజనీరింగ్/ బ్యాచిలర్ టెక్నాలజీ/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ/ ఐటి/ బీఎస్సీ/ బీకాం/ పీజీ అర్హతలు కలిగి ఉండాలి.
వయో పరిమితి :
పోస్టులను అనుసరించి అభ్యర్థులు 02.07.1998 నుండి 01.01.2006 మధ్య జన్మించి ఉండాలి.
అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్ లింక్ ఈ పేజీ దిగువ ఉన్నది.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్టింగ్, మెడికల్ పరీక్షల ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రకటించి, ఇండియన్ నేవీ నిబంధన ప్రకారం ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు రూ.56,100/- నుండి రూ.1,77,500/- వరకు ప్రతినెలా గౌరవ వేతనం కేంద్ర ప్రభుత్వం అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 14.09.2024
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 29.09.2024
అధికారిక వెబ్సైట్ :: https://www.joinindiannavy.gov.in/
0 Response to "Indian Navy SSC 250 Vacancies Notification Out! Apply here"
Post a Comment