Just eat these.. Your brain will work faster than a computer.
ఇవి తినండి చాలు. మీ బ్రెయిన్ కంప్యూటర్ కంటే వేగంగా పని చేస్తుందట.
మనిషి జీవితంలో మెదడు ఆరోగ్యం ప్రాముఖ్యత చాలా ఎక్కువ.. మన శరీరం పనిచేయడానికి శక్తి అవసరం అయినట్లే, మన మెదడు కూడా బాగా పనిచేయడానికి సరైన పోషకాహారం అవసరం.
కాబట్టి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు వైద్య నిపుణులు.. వాస్తవానికి మెదడు మానవుని తలభాగంలో కపాలంచే రక్షించబడి ఉంటుంది. జ్ఞానేంద్రియాలన్నింటికి ఇది ముఖ్యమైన కేంద్రం. మెదడుకు తనంతట తానే సొంతంగా మరమ్మతులు చేసుకోగలిగే సామర్థ్యం కూడా ఉందని పలు అధ్యయనాల్లో తేలింది.
అయితే.. మెదడు మరింత చురుగ్గా పనిచేసేందుకు ఏం తినాలి.. జ్ఞాపకశక్తి పెరిగేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?.. అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.. దీనివల్ల మెదడు జ్ఞాపకశక్తి పెరుగడంతోపాటు.. ఆరోగ్యంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి మీ డైట్‌లో ఎలాంటి ఫుడ్‌ను చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.
వాల్‌నట్ - వేరుశనగ : వాల్‌నట్స్‌లో మెదడుకు మేలు చేసే ఒమేగా-3 వంటి పోషకాలు ఉంటాయి. వాల్‌నట్‌లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. ఇంకా వేరుశెనగ గింజలు కూడా మెదడుకు మంచివిగా పరిగణిస్తారు. ఎందుకంటే వాటిలో మంచి కొవ్వులు-ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
బీన్స్ - ఆకుకూరలు: బీన్స్ లో ఫైబర్, విటమిన్ బి, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఆకు కూరల్లో విటమిన్ ఇ, ఫోలేట్ అధికంగా ఉంటాయి. ఇవి మెదడు సాధారణ అభివృద్ధికి సహాయపడతాయి. ఇంకా కాలీఫ్లవర్, బ్రోకలీ కూడా మెదడు ఆరోగ్యానికి సహాయపడతాయి.. ఈ కూరగాయలలో అధిక మొత్తంలో కోలిన్ ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని బలపరుస్తుంది. ఆలోచనా సామర్థ్యాన్ని పదునుపెడుతుంది.
బ్లూబెర్రీస్: బెర్రీస్ మెదడు అభివృద్ధికి మేలు చేస్తాయి. బ్లూబెర్రీస్ మెదడులో క్షీణించిన మార్పులతో పోరాడటానికి, నరాల పనితీరు, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి.
సాల్మన్ ఫిష్: సాల్మన్ ఫిష్ వంటి ఒమేగా-3లో అధికంగా ఉండే ఆహారాలు మెదడు కార్యకలాపాలను పెంచుతాయి.. మానసిక అభివృద్ధికి సహాయపడతాయి.
కాఫీ -టీ: వీటిలో ఉండే కెఫిన్ మెదడుకు పదును పెట్టి అలసటను తగ్గిస్తుంది. గ్రీన్ టీ మానసిక ఆరోగ్యానికి కూడా ప్రభావవంతంగా ఉంటుంది. (ఈ సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. ఫాలో అయ్యేముందు డాక్టర్లను సంప్రదించండి)
0 Response to "Just eat these.. Your brain will work faster than a computer."
Post a Comment