Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Key Decisions of AP Cabinet

 ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఇతర శాఖలో విలీనం

Key Decisions of AP Cabinet

ఏపీ కేబినెట్‌(AP Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు.

వాలంటరీలను( voluntary System), గ్రామ సచివాలయ సిబ్బందిని ఇతన శాఖల్లో విలీనం చేసేందుకు ఉన్న అవకాశాలపై సమగ్రంగా చర్చించి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని సమావేశం నిర్ణయించిందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో 2 లక్షల 63 వేల మంది వాలంటీర్లు ఉండగా వారిలో లక్షా 07వేల మంది రాజీనామా చేయగా లక్షా 10 వేల మంది ఉన్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ను 15 ఆగస్టు 2023 నుంచి రెన్యూవల్‌ చేయక మోసం చేసిందని దుయ్యబట్టారు. విశాఖపట్నం జిల్లాలోని భోగాపురం (Bhogapuram Airport) విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ ఏపీ కేబినెట్‌ నిర్ణయించింది.

నూతన మద్యం విధానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు, సగటు మద్యం ధర రూ. 99 నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల వ్యవస్థపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. 18 అంశాలకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం.. ఇటీవల ఏపీలో వరదల వల్ల పంటలకు జరిగిన నష్టంపై కౌలు రైతులకు పరిహారం దక్కేలా చూడాలని నిర్ణయించారు.

వాలంటీర్లు సచివాలయాలకు దినపత్రికల కొనుగోలుకు నెలనెలా ఇచ్చే రూ. 200 రద్దు.. 2023లో వాలంటీర్ల పదవీకాలం ముగిసినా రెన్యూవల్‌ చేయలేదని మంత్రులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. పోలవరం డయాప్రమ్‌ వాల్‌ నిర్మాణం పనులు పాత ఏజెన్సీకే ఇవ్వాలని, మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు నిధులు విడుదల,

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Key Decisions of AP Cabinet"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0