Let's find out what happens if you take a bath with cold water.
చల్ల నీళ్లతో స్నానం చేస్తే ఏమౌతుందో తెలుసుకుందాం.
కొంతమంది ఏ కాలమైనా సరే వేడినీళ్లతోనే స్నానం చేస్తే.. మరికొంతమంది చల్ల నీళ్లతో స్నానం చేస్తుంటారు. కానీ చల్ల నీళ్లతో స్నానం చేస్తే ఏమౌతుందో తెలుసా?
కొంతమంది వేడినీళ్ల స్నానం చేస్తే మరికొంతమంది చల్లనీళ్ల స్నానం చేస్తుంటారు. కాలాలతో పాటుగా కొంతమంది ఈ అలవాట్లను మార్చుకుంటారు. నిజానికి స్నానం మన శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా.. మనల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతుంది. అయితే సాధారణంగా స్నానానికి వేడి నీళ్లను, చల్ల నీళ్లను రెండింటినీ ఉపయోగిస్తారు. అయితే ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచివని చాలా మందికి డౌట్ వస్తుంటుంది. నిజానికి వేడి నీళ్లు, చల్ల నీళ్లు రెండూ స్వంత ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
అయితే వేడి నీళ్ల కంటే చల్ల నీళ్లే ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. పిల్లలు చల్ల నీళ్లతోనే స్నానం చేయాలని అపుడప్పుడు పెద్దలు కూడా చెప్తుంటారు. ఎందుకంటే చల్ల నీళ్ల వాటర్ పిల్లల్ని బలంగా, శక్తివంతంగా చేస్తుందని నమ్ముతారు. అందుకే పెద్దలు కూడా చల్లని నీటితో స్నానం చేస్తుంటారు. అసలు ఇదంతా నిజమా? చన్నీటి స్నానం మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుందా? లేదా? అనేది తెలుసుకుందాం పదండి.
వేడి నీళ్లతో పోలిస్తే చల్లని నీళ్లతో స్నానం చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి మనం చల్లని నీళ్లతో స్నానం చేసినప్పుడు మన చర్మం చల్లగా మారుతుంది. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ ప్రక్రియ మన శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది. అయితే ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది. మన శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి తెల్ల రక్త కణాలు అవసరం. ఇది మనల్ని అంటువ్యాధులు, ఇతర రోగాలతో పోరాడటానికి సహాయపడుతుంది.
చల్లని నీటితో స్నానం చేయడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే చల్లని నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీర మంట కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చల్లని నీళ్లతో స్నానం చేయడం వల్ల ఒత్తిడి హార్మోన్లు చాలా వరకు తగ్గుతాయట. కూల్ వాటర్ శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. చల్లని నీటితో స్నానం చేయడం వల్ల మెటబాలిజం కూడా పెరుగుతుంది. అంటే ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందన్న మాట.
చల్లని నీళ్లతో స్నానం చేయడం వల్ల ఒంట్లో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ ను, పోషకాలను బాగా అందిస్తుంది. అదే మనం వేడి నీటి స్నానం చేసినప్పుడు మన రంధ్రాలు తెరుచుకుంటాయి. కానీ చల్లని నీళ్లతో స్నానం చేయడం వల్ల అవి తాత్కాలికంగా బిగుతుగా చేస్తాయి. అలాగే మీ చర్మం, జుట్టులోని సహజ నూనెలను నిలుపుకోవడంలో ఇది మీకు సహాయపడతాయి. డ్రై స్కిన్ సమస్యతో బాధపడేవారు , పెలుసైన జుట్టు ఉన్నవారు చల్ల నీళ్లతో స్నానం చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.
ఉదయాన్నే చల్ల నీళ్లతో స్నానం చేయడం వల్ల మీరు ఫ్రెష్ గా ఉంటారు. రోజంతా ఎనర్జిటిక్ గా ఫీలవుతారు. ఇది మీకు మంచి శక్తిని ఇస్తుంది. చల్ల నీళ్లతో స్నానం చేసినప్పుడు మీ శరీరం వెచ్చగా ఉండటానికి పోరాడుతుంది. ఈ ప్రాసెస్ లో మీ జీవక్రియ తాత్కాలికంగా పెరుగుతుంది. ఇది మీరు కొంత బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
0 Response to "Let's find out what happens if you take a bath with cold water."
Post a Comment