New eye drops for those with poor eyesight!
కళ్లద్దాలకు ఇక చిల్లు. కంటి చూపు మందగించిన వారికి సరికొత్త ఐ డ్రాప్స్!
కంటిచూపు మందగించిన వారికి కళ్లద్దాల అవసరాన్ని దూరం చేసే కొత్త ఐ డ్రాప్స్ మార్కెట్‌లోకి రానున్నాయి. ముంబైకు చెందిన ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ అనే ఫార్మా కంపెనీ తయారుచేసిన ఈ ఐ డ్రాప్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపింది.
వయసు పెరుగుతున్న కొద్దీ కంటిచూపు మందగించే సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. దీనినే ప్రెస్బియోపియా అంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 109 నుంచి 180 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా 40 -45 ఏండ్ల వయసులో ఈ సమస్య మొదలవుతుంది. 60 ఏండ్ల వయసు వచ్చే నాటికి తీవ్రమవుతుంది.
ప్రెస్బియోపియా ఉన్న వారికి దగ్గరి వస్తువులు సరిగ్గా కనిపించవు. ఏదైనా చదవాలంటే కళ్లద్దాలు తప్పనిసరి అవుతుంది. ఈ సమస్యకు చికిత్స చేసేందుకు 'ప్రెస్‌వు ఐ డ్రాప్స్’ను ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసింది. దీనిని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీఓ)కు చెందిన నిపుణుల బృందం సిఫార్సు చేయడంతో డీసీజీఐ తుది అనుమతి ఇచ్చింది. ఈ ఐ డ్రాప్స్ వేసుకోవడం వల్ల ప్రెస్బియోపియా బాధితులకు కళ్లద్దాల అవసరం తగ్గుతుందని ఎన్టాడ్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. దీని ధర రూ.350 వరకు ఉంటుందని, అక్టోబరు మొదటి వారం నుంచి మార్కెట్‌లోకి అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది.
0 Response to "New eye drops for those with poor eyesight!"
Post a Comment