October 1st New Rules
October 1st New Rules:అక్టోబర్ 1 నుండి మారనున్న రూల్స్.
ప్రతినెల మాదిరిగానే అక్టోబర్ 1 నుంచి కూడా అనేక రూల్స్ మారనున్నాయి. ఈ సారి బడ్జెట్లో ప్రవేశపెట్టిన టాక్స్ రేట్ల నుంచి సేవింగ్స్‌కి సంబంధించిన వివిధ అంశాల రూల్స్ ఈ క్రమంలో మారిపోతున్నాయి.
అయితే ఈ అంశాలు వ్యక్తుల ఆర్థికపరమైన నిర్ణయాలు, లక్ష్యాలపై ప్రత్యక్షంగానే ప్రభావాన్ని చూపనున్నాయని నిపుణులు చెబుతున్నారు.
మైనర్ పేరుపై PPF ఖాతా తెరవడానికి అర్హత పొందే వరకు అంటే సదరు వ్యక్తికి 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు వారి పేరుపై ఉంటే ఖాతాలకు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్లకు చెల్లించే వడ్డీ అందించబడుతుంది. 18 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే వర్తించే వడ్డీ రేటు చెల్లించబడుతుంది. మెచ్యూరిటీ వ్యవధి మైనర్ పెద్దవాడైన తేదీ నుండి లెక్కించబడుతుంది. అంటే ఇక్కడ ఖాతా తెరవడానికి మైనర్ వ్యక్తి వాస్తవంగా అర్హత పొందిన తేదీ నుంచి లెక్కగట్టబడుతుంది. అలాగే ఒకటి కంటే ఎక్కువ పీపీఎఫ్ ఖాతాలు ఉన్నట్లయితే.. ప్రైమరీ ఖాతాకు స్కీమ్ అందించే వడ్డీ రేటు చెల్లించబడనుంది.
చిన్న పొదుపు పథకాల్లో ముఖ్యంగా కుమార్తెల భవిష్యత్తు కోసం భారత ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ఖాతాల విషయంలో పారదర్శకతను పెంచేందుకు కొత్తగా తెస్తున్న నిబంధనలు అక్టోబర్ 1, 2024 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ క్రమంలో చట్టబద్ధమైన సంరక్షకులు కాకుండా ఇతరులు అంటే తాతామామల సంరక్షకత్వంలో ఖాతాలు తెరిచినట్లయితే, గార్డియన్ యాక్ట్ ప్రకారం సహజ సంరక్షకులుగా సజీవంగా ఉన్న తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్‌కు బదిలీ చేయబడుతుంది. అలాగే మార్గదర్శకాలకు విరుద్ధంగా తెరిచిన ఖాతాగా పరిగణించడం ద్వారా సక్రమంగా లేని ఖాతాలు మూసివేయబడతాయి.
ప్రతినెల మాదిరిగానే రానున్న నెల మెుదటి రోజున సైతం దేశంలోని చమురు విక్రయ ధరలను ఎల్ పీసీ సిలిండర్ ధరల్లో మార్పులను ప్రకటించవచ్చు. ఇదే క్రమంలో సీఎన్జీ, పీఎన్జీ, ఏవియేషన్ ఫ్యూయల్ ధరలను సైతం ప్రకటిస్తాయి. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల రేట్లలో మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది. ఇదే క్రమంలో డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో మార్పులు ఉండకపోవచ్చు.
పాన్ కార్డుల దుర్వినియోగం, నకిలీలను నిరోధించడానికి అక్టోబర్ 1 నుంచి కొన్ని మార్పులు అమలులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఆధార్ నంబర్‌కు బదులుగా ఆధార్ నమోదు IDని ఉదహరించడానికి అనుమతించే నిబంధనలు, ITRలలో ఆధార్, PAN దరఖాస్తులకు ఇకపై వర్తించవు.
షేర్ల బైబ్యాక్ రూల్స్ సైతం మారిపోతున్నాయి. ఈ క్రమంలో అక్టోబర్ 1 నాటికి షేర్ల బైబ్యాక్ విషయంలో కూడా డివిడెండ్‌ల మాదిరిగానే షేర్ హోల్డర్ల స్థాయిలో పన్నులకు లోబడి ఉండనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లకు అధిక పన్ను భారం పడుతుంది. అదనంగా ఏదైనా మూలధన లాభాలు లేదా నష్టాలను లెక్కించేటప్పుడు ఈ షేర్ల విషయంలో వాటాదారు కొనుగోలు ఖర్చులు పరిగణనలోకి తీసుకోబడనున్నాయి. అలాగే ఫ్లోటింగ్ రేట్ బాండ్ల విషయంలోనూ టీడీఎస్ రూల్స్ మారిపోతున్నాయి. ముందుగా బడ్జెట్లో ప్రకటించిన విధంగా.. అక్టోబర్ 1, 2024 నుంచి ముందుగా బడ్జెట్లో ప్రకటించిన విధంగా.. అక్టోబర్ 1, 2024 నుంచి ఫ్లోటింగ్ రేట్ బాండ్‌లతో సహా పేర్కొన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ బాండ్ల విషయంలో 10% రేటుతో టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అమలులోకి రానుంది.
0 Response to "October 1st New Rules"
Post a Comment