Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

RRB NTPC 2024

 RRB NTPC 2024: 11,558 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. 12వ తరగతి ఉంటే చాలు.

RRB NTPC 2024

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) సెప్టెంబర్ 2న ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో భారతీయ రైల్వేలో 11,558 ఖాళీలను(jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది.

RRB NTPC 2024 నోటిఫికేషన్‌లో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులు ఉన్నాయి. అయితే వీటికి గల అర్హత ప్రమాణాలు ఏంటి, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ప్రక్రియ వంటి వివరాలు.

మెుత్తం ఖాళీలు: 11558

అర్హత

ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ ప్రకారం 12వ తరగతి ఉత్తీర్ణులైతే చాలు. గ్రాడ్యుయేట్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు దరఖాస్తు చేసే వారి వయస్సు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.

చివరి తేదీ

CEN 05/2024 కోసం దరఖాస్తు ప్రక్రియ(rrbapply.gov.in) సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభమవుతుంది. CEN 06/2024 కోసం దరఖాస్తులు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20, 2024 వరకు కొనసాగుతుంది. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులను భర్తీ చేయడం ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ లక్ష్యం. ఇందులో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వంటి పోస్టులు ఉన్నాయి. దీంతో పాటు కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ క్లర్క్‌, అకౌంట్స్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌, జూనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌, ట్రైన్స్‌ క్లర్క్‌ వంటి పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు రుసుము

జనరల్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 500, అందులో రూ. 400 సీబీటీ పరీక్షకు హాజరైన తర్వాత తిరిగి చెల్లించబడుతుంది. SC, ST, Ex-Serviceman, PwBD, మహిళలు, లింగమార్పిడి, మైనారిటీ లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఈ రుసుము రూ. 250.

RRB NTPC 2024 ఎంపిక ప్రక్రియ

మొదట ఆన్‌లైన్ పరీక్ష స్టెజ్ 1 - CBT 1 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణులైన వారికి ఆన్‌లైన్ పరీక్ష స్టేజ్ 2 - CBT 2 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఆయా పోస్టులను బట్టి టైపింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్)/ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్టుల్లో పాసైన వారికి తర్వాత దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. చివరకు వైద్య పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.inని సందర్శించండి
  • అక్కడ మీ ఖాతాను సృష్టించండి
  • ఖాతాను సృష్టించిన తర్వాత, మొబైల్ నంబర్/ఇమెయిల్, పాస్‌వర్డ్‌తో సైన్ ఇన్ చేయండి
  • దరఖాస్తు ఫారమ్‌లో అవసరమైన సమాచారాన్ని పూరించండి
  • ఆ తర్వాత అప్లై చేసుకున్న దరఖాస్తు ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపర్చుకోండి

NOTIFICATION

ONLINE APPLICATION


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "RRB NTPC 2024"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0