Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

RRB Recruitment 2024 Notification

 RRB Notification 2024: ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు, 3445 ఎన్టీపీసీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం - పూర్తి వివరాలు.

RRB Recruitment 2024 Notification

RRB Recruitment 2024 Notification: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వేజోన్లలో ఎన్టీపీసీ (నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ) అండర్ గ్రాడ్యుయేట్(NTPC-Under Graduate) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

దీనిద్వారా 3445 పోస్టులను భర్తీచేయనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే టైపిస్ట్ పోస్టులకు ఇంగ్లిష్, హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి. ఈ పోస్టుల భర్తీకీ సెప్టెంబరు 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 20 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.

దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత అంటే అక్టోబరు 20 రాత్రి 11.59 తర్వాత.. అక్టోబరు 21, 22 తేదీల్లో నిర్ణీత పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష ఫీజు కింద రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ట్రాన్స్జెండర్, ఎక్స్-సర్వీస్మెన్, ఎస్సీ-ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులకు అక్టోబరు 23 నుంచి నవంబరు 1 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. పరీక్ష తేదీలను తర్వాత ప్రకటిస్తారు. రెండు దశల రాతపరీక్షలు, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.

వివరాలు.

ఖాళీల సంఖ్య: 3445

  •  కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2022 పోస్టులు
  • జీతం: రూ.21700.
  • అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 361 పోస్టులు
  • జీతం: రూ.19900
  • జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 990 పోస్టులు
  • జీతం: రూ.19900
  • ట్రైన్స్ క్లర్క్: 72 పోస్టులు
  • జీతం: రూ.19900

రైల్వే జోన్లవారీగా ఖాళీలు..

జోన్ ఖాళీల సంఖ్య

సికింద్రాబాద్              89

అహ్మదాబాద్            210

అజ్మేర్ 71

బెంగళూరు                      60

భోపాల్                         58

భువనేశ్వర్                 56

బిలాస్పూర్                152

ఛండీగఢ్                   247

చెన్నై                         194

గోరఖ్పూర్                  120

గువాహటి                   175

జమ్మూ, శ్రీనగర్          147

కోల్ కతా                    452

మాల్దా                              12

ముంబయి                  699

ముజఫర్పూర్                       68

ప్రయాగ్రాజ్                   389

పాట్నా                                  16

రాంచీ                           76

సిలిగురి                                42

తిరువనంతపురం         112

మొత్తం           3445

అర్హత:ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. టైపిస్ట్ పోస్టులకు కంప్యూటర్పై ఇంగ్లిష్/హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి.

వయోపరిమితి: 01.01.2025 నాటికి 18-33 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీ(NCL) అభ్యర్థులకు 3 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు కేటిగిరీలవారీగా జనరల్/ఈడబ్ల్యూఎస్ 3 సంవత్సరాలు, ఓబీసీ-6, ఎస్సీ/ఎస్టీ 8 సంవత్సరాలు; దివ్యాంగులు 10-15 సంవత్సరాలు; ఇతరులకు రైల్వే నిబంధనల మేరకు వయోసడలింపులు ఉంటాయి.

పరీక్ష ఫీజు:అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్టేజ్-1 పరీక్షకు హాజరైన అభ్యర్థులకు బ్యాంకు ఛార్జీలు మినహాయించి రూ.400 తిరిగి చెల్లిస్తారు. ఇక దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ట్రాన్స్జెండర్, ఎక్స్-సర్వీస్మెన్, ఎస్సీ-ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తారు. వీరికి పరీక్ష సమయంలో మొత్తం ఫీజు తిరిగి చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా.

ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2 ఆన్లైన్ పరీక్షలు, టైపింగ్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్.

స్టేజ్-1 (సీబీటీ) పరీక్ష విధానం:

మొత్తం 100 మార్కులకు 'స్టేజ్-1' కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్ అవేర్నెస్-40 ప్రశ్నలు-40 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. దివ్యాంగులకు అదనంగా 30 నిమిషాలు కేటాయించారు. ఇక పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం అమలుచేస్తారు. ప్రతి తప్పు సమాధానానిక 1/3 వంతున మార్కుల్లో కోత విధిస్తారు.

స్టేజ్-2 (సీబీటీ) పరీక్ష విధానం:

మొత్తం 120 మార్కులకు 'స్టేజ్-2' కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో జనరల్ అవేర్నెస్-50 ప్రశ్నలు-50 మార్కులు, మ్యాథమెటిక్స్-35 ప్రశ్నలు-35 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-35 ప్రశ్నలు-35 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. దివ్యాంగులకు అదనంగా 30 నిమిషాలు కేటాయించారు. ఇక పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం అమలుచేస్తారు. ప్రతి తప్పు సమాధానానిక 1/3 వంతున మార్కుల్లో కోత విధిస్తారు.

టైపింగ్ స్కిల్ టెస్ట్:

అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు టైపింగ్ టెస్టు నిర్వహిస్తారు. ఖాళీలకు అనుగుణంగా 1:8 నిష్పత్తిలో అభ్యర్థులను టైపింగ్ టెస్టుకు ఎంపికచేస్తారు. అభ్యర్థులు కంప్యూటర్లో నిమిషానికి 30 ఇంగ్లిష్ పదాలు లేదా 25 హిందీ పదాలు టైప్ చేయగలగాలి.

ఎంపిక విధానం :

  • ఆన్‌లైన్ పరీక్ష స్టెప్ 1 -CBT 1
  • ఆన్‌లైన్ పరీక్ష స్టెప్ 2 - CBT 2
  • టైపింగ్ టెస్ట్ (స్కిల్ టెస్ట్) /ఆప్టిట్యూడ్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • వైద్య పరీక్ష

ఆన్లైన్లో దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు మొదట https://www.rrbapply.gov.in/ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి
  • హోమ్ పేజీలో పైన అప్లయ్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.
  • అభ్యర్థులు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఒకవేళ ఇప్పటికే అకౌంట్‌ క్రియేట్‌ చేసుకుని ఉంటే. అకౌంట్లోకి లాగిన్ కావాలి
  • అప్లికేషన్ ఫామ్ నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • సబ్మిట్ బటన్పై క్లిక్ చేసి పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి

ముఖ్యమైన తేదీలు.

  • నోటిఫికేషన్ వెల్లడి: 20.09.2024.
  • ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.09.2024.
  • ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.10.2024 
  • ఫీజు చెల్లింపు తేదీలు: 21.10.2024  22.10.2024.
  • దరఖాస్తుల సవరణ: 23.10.2024 - 01.11.2024.

Notification

Website

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "RRB Recruitment 2024 Notification"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0