Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

School Education Department is all set to issue Automated Permanent Academic Account Registry (APAR) ID to students.

 విద్యార్థులకు అపార్‌ ఐడి

School Education Department is all set to issue Automated Permanent Academic Account Registry (APAR) ID to students.

  • మార్గదర్శకాలు విడుదల
  • తొలిదశలో 9, 10 తరగతులకు

విద్యార్థులకు ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ (అపార్‌) ఐడి ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది.

'ఒకటే దేశం-ఒకటే ఐడి'లో భాగంగా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టరు వి విజయ రామరాజు సోమవారం విడుదల చేశారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి)-2020లో భాగంగా ఐపార్‌ ఐడి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల విద్యాపురోగతిని ట్రాక్‌ చేసేందుకు, అభ్యసనలో వారిని మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక గుర్తింపు సృష్టించాలని ఎన్‌ఇపిలో పొందుపరిచినట్లు తెలిపారు.

విద్యార్థులు తమ అకడమిక్‌ రికార్డులను ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు. ఈ ఐడిపై తల్లిదండ్రుల ఉపాధ్యాయ సమావేశాలు (పిటిఎం) నిర్వహించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ ఐడి జనరేషన్‌ను తరగతి ఉపాధ్యాయులు చేస్తారని పేర్కొన్నారు. ఈ ఐడిలో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్‌ కార్డు వివరాలను సరిచూసుకోవాలని తెలిపారు.

ఈ ఐడి రూపొందించిన తరువాత తల్లిదండ్రులు, సంరక్షుల ఫోన్‌కు సందేశం వస్తుందన్నారు. పాఠశాల విద్యార్థులు మైనర్లు కావడం, వారి వివరాలను మరొకరితో పంచుకోవడానికి చట్టబద్ధంగా తల్లిదండ్రుల అంగీకారం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తొలి విడతగా దసరా సెలవుల ముందు రోజు 9, 10 తరగతి విద్యార్థులతో ఇంటికి పంపించాలని ఆదేశించారు. సెలవులు అనంతరం అక్టోబరు 14న ప్రధానోపాధ్యాయులకు సమర్పించాలని తెలిపారు. ఈ ఐడి ప్రక్రియ సక్రమంగా జరిగేలా ప్రాంతీయ, జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "School Education Department is all set to issue Automated Permanent Academic Account Registry (APAR) ID to students."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0