What is your spouse's right to your income?
మీ ఆదాయంపై జీవిత భాగస్వామి హక్కు ఎంత?
ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే .. ఎవరీ ప్రశ్న అడుగుతున్నారో ముందుగా చూసుకోవాలి. భర్త లేక భార్యనా..? అనే దానిపైనే సమాధానం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ లింగం అనేది ఏ పాత్ర పోషించకపోయినా మన చుట్టూ ఉన్న సంస్కృతి, సాంప్రదాయాలు కీలకమే. అది కుటుంబం కావొచ్చు.. సమాజం కావొచ్చు. ఇవి స్త్రీ, పురుషులు భిన్నం అనే ఆలోచనను, నమ్మకాన్ని పెంచుతున్నాయి. ఉదాహరణకు, భర్త.. తన సంపాదనపై తనకు మాత్రమే అధికారం ఉంది. భార్యకు ఎలాంటి అధికారం గానీ వాటా గానీ ఉండదని భావించవచ్చు. కానీ ఇది పూర్తిగా అతని ఆలోచన.. అతడిపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఇలాంటి ఆలోచనలు ఉద్యోగం చేయని, ఆర్థికంగా స్థిరపడని భార్యను భాదపెట్టేవిగా ఉండొచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో తన పాత్ర ఏమీ ఉండదని వారు భావించేలా చేస్తాయి.
మరోవైపు, భార్య ఉద్యోగం చేస్తుంటే.. ఆమె సంపాదించే ప్రతి పైసా ఆటోమేటిక్‌గా భర్త, పిల్లలు, కుటుంబానికి చెందుతుందని భావిస్తారు. కొంత మంది భార్యలు తమ కోరికలు, అవసరాలు ముఖ్యమైనవని నమ్మొచ్చు. ముఖ్యంగా భర్తకు విరుద్ధంగా నడుచుకునే వారు, భర్త మాటకు అంతగా విలువ ఇవ్వనివారు ఈ విధంగా ఆలోచించే అవకాశం ఉంది. ఎవరి ఆలోచన ఎలా ఉన్నా.. ఆమె సంపాదనని.. నచ్చిన విధంగా ఖర్చుచేసుకునే హక్కు ఆమెకు ఉంటుంది. మరికొంత మంది భార్యలు భర్త ఆమోదం, అంగీకారం కోసం కష్టపడుతుంటారు. ఈ అంతర్గత సంఘర్షణ ఆమె సమరస్యాన్ని కోల్పోయేలా చేయడంతో పాటు సంబంధాలను దెబ్బతీస్తుంది. అందువల్ల ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మరింత అధ్యయనం చేద్దాం..
ఒక కుటుంబంలో భర్త మాత్రమే సంపాదనాపరుడైతే.. పూర్తి సమయం గృహిణిగా, తల్లిగా ఇంటి బాధ్యతలు నిర్వహించే భార్యకు, తన భర్త సంపాదనపై సమాన హక్కులు ఉంటాయని మర్చిపోకూడదు. కేవలం సానుభూతితో ఈ హక్కును కల్పించడం లేదు. ఇంటిని సంరక్షించడం, పిల్లల ఆలనాపాలనా చూడటం, వారిపట్ల బాధ్యతగా వ్యవహరించడం.. అనేవి బయట ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం కన్నా ఏమాత్రం తక్కువకాదు.
పూర్వం డబ్బు సంపాదన అనేది కష్టతరమైనదిగా భావించి.. ఉద్యోగం చేసే వారిని మన సమాజంలో ఆరాధించేవారు. అయితే ప్రస్తుతం ఉన్న సమాజంలో పూర్తి సమయం తల్లిగా బాధ్యతలు నిర్వహించడం అంత తేలికకాదని అంగీకరించాల్సిందే. డబ్బు సంతోషకరమైన ఇంటిని, ఆరోగ్యకరమైన పిల్లలను సృష్టించదని గుర్తించుకోవాలి. కుటుంబంలోని మహిళలే డబ్బును జీవితంలోని సంతోషాలుగా మారుస్తారు. అందువల్లే చట్టం కూడా బయటికి వెళ్లి ఉద్యోగం చేయని భాగస్వామికి, ఉద్యోగం చేసే భాగస్వామి సంపాదనపై సమాన హక్కును కల్పించింది. వివాహంతోనే వారు ఈ హక్కును సంపాదించుకున్నారు.
ఇప్పుడు ఉద్యోగం చేసే తల్లుల ఆలోచనా విధానం ఎలా ఉంటుందో చూద్దాం.. ఉద్యోగం చేసే మహిళలు తమ సంపాదన తమ భర్తకు చెందుతుందని నమ్ముతారు. కొందరు సహజంగానే ఈ భావనతో ఉంటే, మరికొందరిని చుట్టూ ఉన్న సమాజం అలా నమ్మేలా చేస్తుంది. (ఇక్కడ ఎవరినీ కించపరచడం ఉద్దేశం కాదు. భార్యలను ప్రేమగా, శ్రద్ధగా చూసుకొనే భర్తలెందరో ఉన్నారు. వారి భార్యలకు ఆర్థిక స్వేచ్చ ఇచ్చేందుకు కూడా వారు వెనుకాడరు.)
మహిళలు.. తమ సంపాదనను తమకోసం, తమ అవసరాల కోసమే వినియోగించుకుంటే స్వార్థపరులమనే భావన.. వారికే స్వయంగా కలిగే అవకాశం ఉంటుంది. దీనికి కుటుంబ సభ్యుల స్వరం కూడా తోడైతే.. మహిళలు తమపై ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోవడం మాత్రమే కాకుండా, సరైన స్థానాన్ని గుర్తించడం కూడా కష్టమవుతుంది. ఉదాహరణకు, ఒక మహిళ తన తల్లిదండ్రులకు లేదా తన పుట్టింటికి సంబంధించిన కుంటుంబ సభ్యులకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటే ఆ విధంగా చేసేందుకు ఆమెకు ఎలాంటి సంకోచం, బెరుకు ఉండకూడదు. అదే సమయంలో భార్య తన భర్త ఇష్టాయిష్టాలను కూడా గౌరవించాలి. భర్త తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులతోనూ మర్యాదగా ప్రవర్తించాలి.
సంపాదన ఎవరిదైనా.. ఎవరికేదైనా ఇవ్వాలనుకున్నా.. ఖర్చు చేయాలన్నా.. భార్యాభర్తలిద్దరూ కలిసి చర్చించుకోవాలి. వాస్తవానికి ఈ విధమైన చర్చలు ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరికి తెలియజేయడంతో పాటు, ఒకరిని ఒకరు అర్థం చేసుకునేందుకు తోడ్పడతాయి. దీంతో బంధాలు మరింతగా బలపడతాయి. ఈ చర్చలు ఒకరి ఆలోచనలు మరొకరితో పంచుకోవడానికి, వారి వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడానికే తప్ప, వాదించడానికి కాదని మర్చిపోకూడదు. ఇవ్వడం/ ఖర్చు చేయడం సముచితంగా అనిపించకపోయినా, భాగస్వామి కోరికలు కుటుంబ ఆర్థిక సమతుల్యతకు హాని చేసేవిగా ఉన్నా.. మీరు వాటిని గౌరవిస్తే, ఇది ఒక అలవాటుగా మారిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇది కుటుంబానికి అంత శ్రేయస్కరం కాదు. అందువల్ల దీనికి కారణం ఏమిటో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా అభద్రతా భావం తలెత్తితే.. సొంతంగా గానీ, నిపుణుల సహాయంతో గానీ పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి.
భవిష్యత్తులో ఎప్పుడైనా.. భాగస్వామి అవసరాలపై మీ వైఖరి భిన్నంగా ఉంటే, మొదట దాన్ని మీ భాగస్వామి దృష్టికోణం నుంచి చూసేందుకు ప్రయత్నించండి.
1. కుటుంబ నెలవారీ బడ్జెట్, పొదుపులపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది?
2. ప్రభావం చూపట్లేదు అని తెలిసినా.. అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లయితే.. దీనికి గల కారణాలను తెలుసుకునేందుకు సమయం కేటాయించండి. వారిలో నమ్మకాలు.. భయాలే దీనికి కారణంగా అనిపిస్తే, ఈ విషయాలలో నిపుణుడైన థెరపిస్ట్ సహాయం తీసుకోవడం మంచిది.
3. ఒకవేళ ప్రతికూల ప్రభావం చూపితే.. మీ భాగస్వామి (అతను/ ఆమె) ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకోండి. వాస్తవాలను తెలియజేయండి. అతను/ఆమెను ఒక నిర్ణయానికి రమ్మనండి.
4. భాగస్వామి ఏదైనా విషయాన్ని అడిగినప్పుడు లేదా ఏదైనా విషయంలో అనుమతి కోరినప్పుడు మీకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. అధికారంతో చెప్పినట్లు కాకుండా వారు ప్రభావితం అయ్యే స్వరంతో చెప్పాల్సి ఉంటుంది.
వైవాహిక జీవితంలో.. చిన్న చిన్న విషయాల్లో వచ్చే భేదాభిప్రాయాల వల్ల దీర్ఘకాలిక బంధం దెబ్బతినకుండా జాగ్రత్త వహించండి.
ప్రస్తుతం డబ్బు వల్ల ఎదురయ్యే సమస్యలు మీ బంధానికి చేసే నష్టాన్ని భర్తీ చేయగలవా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి.
0 Response to " What is your spouse's right to your income?"
Post a Comment