AP Cabinet
ఈ నెల 16వ తేదీన ఏపీ క్యాబినెట్ భేటీ
**************************************
***************************************
ఈ నెల 16న ఏపీ మంత్రి మండలి సమావేశం జరగనుంది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో 16వ తేదీ ఉదయం 11 గంటలకు క్యాబినెట్ భేటీ జరగనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు 14వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు క్యాబినెట్‌లో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు సమర్పించాలని తెలియజేశారు.
రతన్ టాటా అకాల మృతితో ఈ నెల 10వ తేదీన జరిగిన మంత్రి మండలి భేటీలో అజెండా వాయిదా పడింది.దీంతో క్యాబినెట్ నిర్వహణ తేదీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మరోసారి ఖరారు చేశారు.ఈ భేటీలో చెత్తపన్ను రద్దు,పీ - 4 విధానం అమలు, ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీ వంటి అంశాలపై చర్చించనున్నారు.అంతే కాకుండా...స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు, దేవాలయాల పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులకు తప్పనిసరిగా చోటు కల్పించడం తదితర అంశాలపై క్యాబినెట్‌లో చర్చించి ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.అలానే రాజధాని అమరావతి నిర్మాణాలు,పోలవరం ప్రాజెక్టుపైనా క్యాబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.
0 Response to "AP Cabinet"
Post a Comment