AP DSC 2024 Update
AP DSC 2024 Update: ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ 2024 నోటిఫికేషన్ తేదీ ఖరారు..తాజా అప్డేట్.
AP DSC 2024 Update: ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ మొదటి వారంలోనే విడుదల కానుంది. డీఎస్సీ-2024 నోటిఫికేషన్ ను నవంబరు 3న విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది
ఏపీలో డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న 'టెట్ పరీక్షల ఫలితాలను నవంబరు 2న ప్రకటిస్తారు.
టెట్ ఫలితాలు వెలువరించిన మరుసరటి రోజే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని భావించినా మరింత మంది అభ్యర్థులకు టెట్ అర్హతకు అవకాశం కల్పించడంలో భాగంగా తొలుత టెట్ నిర్వహించారు. ప్రస్తుతం టెట్ 2024 పరీక్షలు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న మెగా డిఎస్పీలో ఎలాంటి న్యాయవివాదాలకు తావివ్వకుండా చేపట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారుల్ని ఇప్పటికే ఆదేశించారు.
టెట్, మెగా డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఇప్పటికే ఆశావహులు కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగాలు మానుకుని పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. ఉద్యోగ ప్రకటన చేసిన ఆర్నెల్లకు మించి ఆలస్యమైతే అభ్యర్థుగా భారమవుతుందని భావించారు. దీంతో నవంబర్‌లోనే డిఎస్సీ పరీక్షల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
సిలబస్‌లో మార్పు లేదు
డిఎస్సీ 2024 సిలబస్ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఇప్పటికే తోసిపుచ్చింది. సిలబస్ వివరాలను https://aptet.apcfss.in అందుబాటులో ఉంచామని స్పష్టత ఇచ్చారు.
మెగా డీఎస్సీలో కొన్ని జిల్లాలకు పలు విభాగాల్లో తక్కువ పోస్టులు వచ్చాయంటూ పలువురు అభ్యర్థులు తనని కలిసిన విషయాన్ని లోకేష్ అధికారుల వద్ద ప్రస్తావించి వివరాలు అడిగారు. ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని, దీనివల్ల పోస్టులు తగ్గాయని అధికారులు వివరణ ఇచ్చారు.
అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో పోస్టులకు సంబంధించి న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. స్కూళ్ల మూసివేతకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకొచ్చిన జిఓ. 117 వలన ఎటువంటి నష్టం కలిగిందన్న విషయమై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఏపీలో కూటమి ప్రభుత్వంలోకి రావటంతో టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు భారీ శుభవార్తను చెప్పిన సంగతి తెలిసిందే. మెగా డీఎస్సీ దస్త్రంపై చంద్రబాబు తొలి సంతకం కూడా చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో విద్యాశాఖ కూడా కసరత్తు షురూ చేసింది. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.
పోస్టుల వివరాలు
తాజాగా వచ్చే నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)- 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.
స్కూల్ అసిస్టెంట్ - 7,725
ఎస్‌జీటీ - 6371
టీజీటీ - 1781
పీజీటీ - 286
పీఈటీ - 132
ప్రిన్సిపల్స్ - 52
త్వరలోనే కొత్త నోటిఫికేషన్
వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ పోస్టుల్లో 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), 2,299 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ), 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తి అయింది. డీఎస్సీతో పాటే టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. టెట్ ఫలితాలు రావాల్సి ఉంది. ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ తో డీఎస్సీ పరీక్షలు మాత్రం వాయిదా పడుతూ వచ్చాయి. ఇంతలోనే రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో…. సీన్ మారిపోయింది. కొత్త ప్రభుత్వం మెగా డీఎస్సీ విడుదలకు శ్రీకారం చుట్టింది.
ప్రక్రియ పూర్తికి డెడ్ లైన్
విద్యాశాఖ కొత్తగా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనుంది. గత డీఎస్సీ ప్రకటనను అనుసరించి దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేయక్కర్లేదు. కొత్తగా ఏ జిల్లాలకైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఛాన్స్ ఇవ్వనున్నారు. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం ప్రక్రియను 6 నెలల్లోపే పూర్తి చేయనున్నారు
0 Response to "AP DSC 2024 Update"
Post a Comment