AP Job Notification 2024
AP Job Notification 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..వచ్చే నెలలో భారీ నోటిఫికేషన్.
ఎన్నికల హామీ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేసే పనిలో పడింది.ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ని ప్రకటించింది.
అందుకు సంబంధించిన ఫైల్ పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు 16,347 పోస్టులతో కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించింది. నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది.దీంతో నిరుద్యోగ యువతలో ఆనందం వ్యక్తం అవుతుంది.ఎన్నికలకు ముందు సుమారు 6000 ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది వైసీపీ సర్కార్.కానీ నియామక ప్రక్రియ మాత్రం చేయలేదు. ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. కావలిసే జగన్ సర్కార్ డిఎస్సీ నోటిఫికేషన్ విషయంలో జాప్యం చేసిందన్న విమర్శలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేసింది. దానికి మరో పదివేల ఉపాధ్యాయ పోస్టులను జత కలిపి భర్తీ చేయాలని భావించింది.
డిసెంబర్ లోగా ప్రక్రియ
డిసెంబర్ లోగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ మేరకు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మెగా డీఎస్సీ పూర్తయితే రాష్ట్రంలో సింగిల్ టీచర్ స్కూల్ లకు అదనంగా ఉపాధ్యాయులు వస్తారు. మరోవైపు డిఎస్సి ప్రిపరేషన్లో అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. కటోర శ్రమ చేస్తున్నారు. కాగా ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్లు 6371, స్కూల్ అసిస్టెంట్లు 7725 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వ ఆదేశాల్లో తెలిపింది. వీటితోపాటు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 286, వ్యాయామ ఉపాధ్యాయులు పీఈటీలు 132, ప్రిన్సిపల్ పోస్టులు 52 భర్తీ చేయనున్నట్లు ఆదేశాల్లో స్పష్టం చేసింది. గత ఆరు సంవత్సరాలుగా నిరుద్యోగ అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల కానుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
యంత్రాంగం సన్నాహాలు
మరోవైపు జిల్లాల వారీగా రోస్టర్ పద్ధతిలో నియామక ప్రక్రియ ఉంటుందని తెలుస్తోంది. అందుకు సంబంధించి జిల్లాల యంత్రాంగాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు పాఠశాలల విలీనం పేరుతో గత వైసిపి ప్రభుత్వం 117 జీవోను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఉపాధ్యాయ పోస్టులు తగ్గే అవకాశం ఉంది. అందుకే ఆ జీవోను రద్దు చేయాలని డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుండడంతో శిక్షణ కేంద్రాలు అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి.
0 Response to "AP Job Notification 2024"
Post a Comment