Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Cheating At Petrol Pump

 Cheating At Petrol Pump: ఇంధనం నింపేటప్పుడు '0' మాత్రమే చూస్తే చాలదు, దీనిని పట్టించుకోకపోతే గుండు కొట్టేస్తారు.

Cheating At Petrol Pump

ప్రస్తుతం, బైక్లు, కార్లు ప్రజల అవసరాలుగా మారాయి. చాలామంది ఇళ్లలో బైకులు, కార్లు ఉన్నాయి. ఈ బండ్లు లేకపోతే బతుకు బండి సాగదు.

కాబట్టి, బైక్/కార్లలో పెట్రోల్ లేదా డీజిల్ నింపడానికి ప్రజలు ప్రతిరోజూ పెట్రోల్ పంపుల దగ్గర హాజరు వేయించుకుంటున్నారు. 

ప్రజల అవసరమే మోసానికి మొదటి మెట్టు. పెట్రోల్ పంపుల దీనికి మినహాయింపు కాదు. వాహనాల్లో తక్కువ పెట్రోల్/ డీజిల్ నింపడం, కల్తీ చేయడం లేదా మీటర్ను ట్యాంపర్ చేయడం వంటి అక్రమాల గురించి మనం చాలాసార్లు వార్తల్లో విన్నాం, చూశాం. చాలామంది వాహనదార్లు ఈ విషయాల్లో పెట్రోల్ పంప్ ఉద్యోగులతో గొడవలకు దిగుతారు, చివరకు ఆ వ్యవహారం కొట్లాటగా కూడా మారొచ్చు.

పెట్రోల్ పంపులో పెట్రోల్ లేదా డీజిల్ నింపుకునే సమయంలో మీటర్ను చెక్ చేయాలని తరచుగా వింటుంటాం. మీటర్ సున్నాను ('0') సూచించినప్పుడే ఇంధనం నింపడం ప్రారంభించాలి. ఇలా చేస్తే పెట్రోల్ పంప్ సిబ్బంది మిమ్మల్ని మోసం చేయలేరు. మీరు చెల్లించే పూర్తి డబ్బుకు సరిపడా పెట్రోల్ పొందొచ్చు. అయితే, ఆయిల్ స్కామ్కి కేవలం ఒక మార్గం మాత్రమే లేదని గుర్తుంచుకోండి. పెట్రోల్ పంపుల వద్ద స్కామ్ చేయడానికి కూడా జంప్ ట్రిక్ను కూడా ఉపయోగిస్తారు. 

ఈ విషయాన్ని కూడా చెక్ చేయాలి

సాధారణంగా, పెట్రోల్ పంప్ మీటర్లో సున్నా కనిపించిన తర్వాతే మీ బండిలో పెట్రోల్/ డీజిల్ నింపుకోవాలి. దీనివల్ల మీకు పూర్తి పెట్రోల్ లేదా డీజిల్ వస్తుంది, మీకు ఎలాంటి డబ్బు నష్టం ఉండదు. అయితే ఇది ఒక్కటే సరిపోదు. పెట్రోల్ పంప్ ఉద్యోగులు జీరో తర్వాత మీతో ఓ ఆట ఆడుకుంటారు. వాళ్లు చేసే ట్రిక్స్ ఫలితంగా మీటర్ 0 తర్వాత నేరుగా 5కి చేరుకుంటుంది.

మీటర్ 0 తర్వాత 1, 2, 3, 4 నుంచి మొదలయ్యే బదులు నేరుగా 5 నుంచి మొదలుకావచ్చు. అంటే, '0'ని చూసి అంతా ఓకే అనుకున్న మీరు, ఆ నంబర్లు జంప్ అయిన విషయాన్ని పట్టించుకోకపోవచ్చు. దీనివల్ల నష్టపోవాల్సి వస్తుంది. అందుకే, ఈ విషయంపై కూడా ఓ కన్నేసి ఉంచండి. 

దీంతో పాటు, ఇంధనం సాంద్రతను (density) కూడా గమనించాలి. పెట్రోల్ పంప్ మెషీన్లోని 'అమౌంట్', 'వాల్యూమ్' తర్వాత ఇది మూడో గడిలో కనిపిస్తుంది. భారతదేశంలో, పెట్రోల్కు అనువైన సాంద్రత 15°C వద్ద 720–775 kg/m3. ఈ పరిధిలో సాంద్రత కలిగిన ఇంధనం నాణ్యంగా ఉందని అర్ధం.

స్వచ్ఛతను పరీక్షించడానికి ఫిల్టర్ పేపర్

1. పెట్రోల్ వచ్చే నాజిల్ను శుభ్రం చేయండి

2. నాజిల్ నుంచి ఫిల్టర్ పేపర్పై పెట్రోల్ చుక్క వేయండి.

3. పెట్రోల్లో క్వాలిటీ ఉంటే, ఫిల్టర్ పేపర్పై పెట్రోల్ రెండు నిమిషాల్లో ఆవిరైపోతుంది, మరక పడదు. మరక మిగిలి ఉంటే ఆ పెట్రోల్ కల్తీ కావచ్చు.

ఫిర్యాదు చేసేందుకు టోల్-ఫ్రీ నంబర్లు

ఇండియన్ పెట్రోలియం పెట్రోల్ పంపు గురించి ఫిర్యాదు చేయడానికి టోల్-ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 1800-22-4344

HP పెట్రోల్ పంపుల గురించి ఫిర్యాదు చేయడానికి టోల్-ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 1800-2333-555కి 

ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులపై ఫిర్యాదు చేయడానికి టోల్ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 1800 2333 555 

కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ https://pgportal.gov.in/ లోకి వెళ్లి కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Cheating At Petrol Pump"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0