Cylinders are free. Explanation of how many cylinders are given to anyone.
CM Chandrababu: సిలిండర్లు ఫ్రీ. ఎవరికీ ఎన్ని సిలిండర్లు ఇస్తారో వివరణ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పండగ సందర్భంగా మరో కీలక పథకం ప్రారంభించనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
పండగ సందర్భంగా మహిళలకు శుభవార్త చెప్పారు. దీపం పథకం కింద ఉచితంగా సిలిండర్లు అందజేస్తామని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి.. ఆ రోజున దీపం పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
ఏడాదికి ఎన్నంటే.
ప్రభుత్వ మార్గ దర్శకాల మేరకు అర్హులైన వారికి దీపం పథకం కింద సిలిండర్లను అందజేస్తారు. ఏడాదికి మూడు సిలిండర్లు మాత్రమే ఫ్రీగా ఇస్తారు. ఇందుకోసం ప్రభుత్వంపై రూ.2,684 కోట్ల భారం పడనుంది. మహిళ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీపం పథకం రాష్ట్ర చరిత్రలో గొప్ప మైలురాయిగా నిలుస్తోందని అభిప్రాయ పడ్డారు. ఆడ పడుచులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
ఎవరు అర్హులంటే..
ప్రధానమంత్రి ఉజ్వల గ్యాస్ పథకం ప్రయోజనం పొందేవారికి మాత్రమే దీపం పథకానికి అర్హులు. మిగతా వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.. ఉజ్వల గ్యాస్ లబ్దిదారులకు ఈజీగా దీపం పథకం అమలవుతుంది
అర్హతలు
- విధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు కావాలి.
- గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి
- ఆర్థికంగా వెనకబడిన వారైతే అర్హులు
- బీపీఎల్ కుటుంబాలు దరఖాస్తు చేయాలి.
- వైట్ రేషన్ కార్డు ఉన్న వారిని ప్రమాణికంగా తీసుకుంటారు.
కావలసిన పత్రాలు
- ఆధార్ కార్డ్
- రేషన్ కార్డ్
- మొబైల్ నంబర్
- కరెంట్ బిల్లు
- నెటివిటి సర్టిఫికెట్
3 సిలిండర్లు.
దీపం పథకం కింద మూడు సిలిండర్ల కోసం ఆన్ లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సూచించిన విధంగా పేరు, చిరుమానా రాయాలి. తర్వాత డాక్యుమెంట్స్ ఫొటోలు అప్ లోడ్ చేయాలి. చివరగా యాక్సెప్ట్ చేసి, సబ్ మిట్ చేయడంతో అప్లై చేసినట్టు అవుతుంది. దానిని అధికారులు పరిశీలించి.. మీరు అర్హులు అయితే ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేందుకు అంగీకరిస్తారు.
0 Response to "Cylinders are free. Explanation of how many cylinders are given to anyone."
Post a Comment