Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Free gas cylinder scheme in AP: Booking from 29th of this month

 ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం: ఈనెల 29 నుంచి బుకింగ్.31 నుంచిఅందజేత. అర్హతలు. ఎలా బుక్ చేసుకోవాలి.సబ్సిడీ ఎప్పుడు పడుతుంది పూర్తి వివరాలు.


సూపర్ సిక్స్ హామీల్లోని దీపం పథకం అమలుపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసక్తికర కీలక అప్డేట్ ఇచ్చారు. ఈనెల 29 ఉదయం 10 గంటలు నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రారంభం అవుతుందని వెల్లడించారు.

సచివాలయం శుక్రవారం మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు.సూపర్ 6 పథకంలో భాగంగా అర్హత ఉన్న ప్రతి మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు అందిస్తాం అని హామీ ఇచ్చారు. ఈ నెల 29 ఉదయం 10 గంటలు నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రారంభం అవుతుంది అని అన్నారు. మొదటి గ్యాస్ సిలిండర్ అక్టోబర్ 31 నుండి మార్చి 31 లోగా బుక్ చేసుకోవచ్చు అని సూచించారు. 48 గంటల్లో గా ఇంటికి గ్యాస్ సిలిండర్ అందేలా చర్యలు చేపడతామని.. 48 గంటల్లో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మొత్తం లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతాయి అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.


అర్హతలు ఇవే

ఈ నెల 31 న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేసే కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభింస్తారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తదనంతరం వెంటనే ప్రతి ఇంటికీ మొదటి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఎల్.పి.జి.కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆథార్ కార్డు అర్హతగా ఈ పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, 1.47 రేషన్ కార్డులు ఉన్నాయని, వీరిలో అర్హులు అందరికీ ఈ పథకం వర్తింప చేయడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కుంటున్నా సరే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 


ఈనెల 29 నుంచి బుకింగ్

ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఈనెల 29 నుండి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని.. ఈనెల 31వ తేదీ నుండి గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించడం జరుగుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోగానే ఒక ఎస్.ఎం.ఎస్. సంబందిత లబ్దిదారుని ఫోన్ నెంబరుకు వెళుతుందని మంత్రి నాదెండ్ల వెల్లడించారు. గ్యాస్ బుక్ చేసుకున్న 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లో... 48 గంటల్లో గ్రామీణా ప్రాంతాల్లో గ్యాస్ సిలిండ్లను డెలివరీ చేయడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. అదే విధంగా గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లోనే డి.బి.టి. విధానం ద్వారా లబ్దిదారుల ఖాతాలోనికి నేరుగా రాయితీ సొమ్ము జమ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందజేసే మూడు ఉచిత సిలిండర్లలో మొదటి సిలిండర్ మార్చి 31 లోపు, రెండోది జూలై 31 లోపు, మూడోది నవంబరు 30 లోపు ఎప్పుడైనా పొందవచ్చని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 


మూడు బ్లాక్ పీరియడ్లుగా అమలు

మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు కోసం ఏడాదిని మూడు బ్లాక్ పీరియడ్లుగా పరిగణించడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మొదటి బ్లాక్ పీరియడ్ ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు, రెండో బ్లాక్ పీరియడ్ ను ఆగస్టు 1 నుండి నవంబరు 31 వరకు మరియు మూడో బ్లాక్ పీరియడ్ ను డిశంబరు 1 నుండి మార్చి 31 వరకు పరిగణించడం జరుగుతుందని పేర్కొన్నారు. పథకం అమల్లో లబ్దిదారులకు ఏమన్నా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 


ప్రభుత్వంపై రూ.2684 కోట్ల భారం

గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్దిదారులకు రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీని జమచేయాలని, ఆ విధంగా ప్రణాళిక సిద్దం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మహిళలకు ఇంటి ఖర్చులు తగ్గించాలనే ఆలోచనతో ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చామని....ఇప్పుడు మళ్లీ మూడు గ్యాస్ సిలిండర్ల ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుందని సీఎం అన్నారు. వంట గ్యాస్ కోసం వెచ్చించే ఖర్చును గృహిణులు ఇతర అవసరాలకు వాడుకోవచ్చని సీఎం అన్నారు. పేదల జీవన ప్రమాణాలు పెంచడంలో ఇలాంటి పథకాలు దోహదం చేస్తాయని సీఎం అన్నారు. అందుకే ఆర్థిక కష్టాలు ఉన్నా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని చంద్రబాబు నాయుడు అన్నారు. అర్హత గల ఏ ఒక్క లబ్దిదారునికి ఈ పథకం రాలేదనే విమర్శ రాకుండా కట్టుదిట్టంగా కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో తొలుత రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యదర్శి వీరపాండ్యన్ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి పవర్ పాంయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర రూ.876 లు కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్ కు రూ.25ల సబ్సిడీ ఇస్తుండగా ప్రస్తుతం ప్రతి సిండర్ ధర రూ.851లుగా ఉందని వివరించారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వల్ల ప్రభుత్వంపై రూ.2 వేల 684 కోట్ల భారం పడుతుందని, అదే ఐదేళ్ళకు కలిపి రూ.13వేల 423 కోట్ల భారం పడుతుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Free gas cylinder scheme in AP: Booking from 29th of this month"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0