GST rates are going to change. This is the list of items whose prices will increase and decrease.
జీఎస్టీ రేట్లు మారబోతున్నాయ్.. ధరలు పెరిగే, తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే.
జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన జీఓఎం (జీఎస్టీ మంత్రుల బృందం) శనివారం(అక్టోబర్ 20, 2024) కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది.
20 లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్, సైకిల్స్, నోట్బుక్స్పై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది. 20 లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్పై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తుండటం గమనార్హం.
రూ.10 వేల కంటే తక్కువ ధర కలిగిన సైకిల్స్పై ప్రస్తుతం విధిస్తున్న 12 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని జీఓఎం ప్రతిపాదించింది. ఈ సవరణతో ఇకపై 5 శాతం జీఎస్టీ మాత్రమే విధించనున్నారు. అయితే.. ఖరీదైన వాచ్లు, షూస్పై జీఎస్టీ పెంపునకు జీఓఎం ప్రతిపాదనలు చేసింది. రూ.15 వేల కంటే ఎక్కువ ఖరీదైన షూస్పై, రూ.25 వేల కంటే ఎక్కువ ఖరీదైన రిస్ట్ వాచ్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 28 శాతానికి పెంచాలని జీఓఎం ప్రతిపాదించింది.
సామాన్య, మధ్యతరగతి వర్గాలు వినియోగించే 100 వస్తువులపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించి ఊరట కలిగించాలని జీఓఎం యోచన చేసింది. హెయిర్ డ్రైయర్స్, హెయిర్ కర్లర్స్, బ్యూటీ, మేకప్ ఉత్పత్తులపై 28 శాతం జీఎస్టీ విధించాలని జీఓఎం భావిస్తుండటం గమనార్హం. జీఎస్టీ నుంచి సీనియర్ సిటిజన్స్ కోసం తీసుకునే హెల్త్ పాలసీలకు మినహాయింపు ఇచ్చి ఊరట కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూ.5 లక్షల వరకూ కవర్ అయ్యే రెగ్యులర్ హెల్త్ పాలసీలపై, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్కు కూడా జీఎస్టీ నుంచి మినహాయింపు దక్కనున్నట్లు సమాచారం.
జీఎస్టీ కౌన్సిల్ ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకోనుంది. బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి అధ్యక్షతన ఈ జీఓఎం సమావేశం జరిగింది. పెంచిన జీఎస్టీ రేట్ల వల్ల ప్రభుత్వానికి రూ.22 వేల కోట్ల ఆదాయం సమకూరనుంది. ఈ జీఓఎం సమావేశంలో బీహార్ డిప్యూటీ సీఎంతో పాటు ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా, రాజస్థాన్ హెల్త్ మినిస్టర్ గజేంద్ర సింగ్, కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరె గౌడ, కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ పాల్గొన్నారు.
0 Response to "GST rates are going to change. This is the list of items whose prices will increase and decrease."
Post a Comment