Nandivardhanam Plant
Nandivardhanam Plant : ఈ మొక్క ఎక్కడ కనిపించినా సరే.. విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చి పెంచుకోండి. వివరణ.
మనం ఎన్నో రకాల పూల మొక్కలను పెరట్లో పెంచుకుంటాం. కొన్ని రకాల మొక్కలు పూలు పూయడమే కాకుండా ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటాయని చెప్పవచ్చు.
ఇలా ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కల్లో 5 రెక్కల నందివర్ధనం మొక్క కూడా ఒకటి. దీనినే గరుడవర్ధనం అని కూడా అంటారు. ఈ మొక్క పూలు చాలా అందంగా ఉంటాయి. ఈ పూలను ఎక్కువగా దైవరాధనకి ఉపయోగిస్తాం. మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు.
ఈ నందివర్ధనం పూలు ఎక్కువగా వర్షాకాలం మరియు వేసవి కాలంలో పూస్తాయి. శీతాకాలంలో ఈ పువ్వులు చాలా తక్కువగా పూస్తాయి. వర్ష మరియు శీతాకాలంలో చాలా మంది కఫ, పైత్య దోషాలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. నందివర్ధనం కఫాన్ని, పైత్యాన్ని, కడుపులో మంటలను, రక్తదోషాలను, జ్వరాన్ని, వాంతులను, మగతను వంటి విష ప్రభావాలను తగ్గిస్తుంది. నందివర్ధనం మొక్కలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉండటం వలన ఈ మొక్క యొక్క ఆకుల రసాన్ని గాయాలకు పై పూతగా రాస్తే తొందరగా నయం అవుతాయి.
అంతేకాకుండా నందివర్ధనం పూల రసంలో కర్పూరం వేసి బాగా కలిపి ఆ మిశ్రమం నుంచి ఒక చుక్కను కంటిలో వేసుకుంటే కంటి మంటలు, కన్ను ఎర్రబడటం వంటివి తగ్గిస్తుంది. అలాగే తాజా నందివర్ధనం పువ్వులను కళ్లపై పెట్టుకుంటే కంటి ఎరుపుదనం తగ్గించి కంటికి చల్లదనాన్ని కలిగిస్తుంది. నందివర్ధనం మొక్క ఆకులు, కాండం, వేళ్ళు, పువ్వులు అన్నింటిలోనూ ఔషద గుణాలు అధికంగా ఉంటాయి.
తలనొప్పిగా ఉన్నవారు ఈ ఆకుల రసాన్ని నుదురుకి రాస్తే తొందరగా తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ నందివర్ధనం పువ్వులను రాత్రంతా నీటిలో వేసి ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటితో కళ్లను శుభ్రం చేసుకుంటే కంటి సమస్యలు తగ్గుతాయి. ఈ నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో త్రాగితే కిడ్నీ సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్ లు తగ్గుముఖం పడతాయి. ఇలా నందివర్ధనం మొక్కతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నయి కనుక దీన్ని అందరూ ఇంట్లో పెంచుకోవాలి. దీంతో ఎన్నో లాభాలను పొందవచ్చు.
0 Response to "Nandivardhanam Plant"
Post a Comment