Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New rule on savings accounts: What should be the minimum balance from October 15?

 సేవింగ్స్ అకౌంట్స్‌పై కొత్త రూల్: అక్టోబర్ 15 నుంచి మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలి?

New rule on savings accounts: What should be the minimum balance from October 15?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రంగంలో కొత్త మార్పులకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే గోల్డ్ లోన్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ తదితర విభాగాలపై అనేక నిబంధనలు విధించిన ఆర్బీఐ మరికొన్ని మార్పులకు ప్రయత్నిస్తోంది.

కొత్త నిబంధనలు అక్టోబరు 15 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటిల్లో సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వల విషయంపై కూడా కొత్త రూల్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 15 తర్వాత ఈ విషయంపై మరింత స్పష్టత వస్తుందని కస్టమర్లు భావిస్తున్నారు.

సంవత్సరానికి రూ.10 లక్షలకు పైగా దాచుకోవచ్చు

బ్యాంకు ఖాతాలో ఉంచాల్సిన కనీస సొమ్ముకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనను అమలు చేయనుంది. ఈ నెల అక్టోబర్ 15 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం వినియోగదారులు ఏడాదిలోపు పొదుపు ఖాతాలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేయవచ్చు. డబ్బును డిపాజిట్ చేసేటప్పుడు టాక్సులు, ఫీజుల గురించి మీ బ్యాంక్‌లో పూర్తి వివరాలకు సంప్రదించండి.

లిమిట్ దాటితే వివరాలు చెప్పాలి

మీరు మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేసుకొనేటప్పుడు భారీ మొత్తంలో డిపాజిట్ చేస్తే కొన్నిసార్లు బ్యాంకులు మీ ఖాతాను తనిఖీ చేయవచ్చు. అంత డబ్బు ఎలా వచ్చింది. ఆదాయ మార్గం, ప్రూఫ్ గురించి వివరాలు అడగవచ్చు. పొదుపు ఖాతాలు లేదా ఇతర ఖాతాల్లో డబ్బు ప్రవాహం పెరిగితే మీకు ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసులు కూడా అందవచ్చు. సీనియర్ సిటిజన్లు ప్రత్యేక అవకాశం ఇచ్చారు. వారు రూ. 1 లక్ష వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ డబ్బుపై ఎలాంటి విచారణ జరగదు.

మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఫైన్

ఈ రోజుల్లో బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే ఖాతాదారులకు జరిమానా విధిస్తున్నాయి. కొన్ని బ్యాంకులైతే చాలా రోజుల తర్వాత కూడా అకౌంట్ లో డబ్బు జమ చేస్తే ఇప్పటి వరకు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు పెనాల్టీ కూడా వేస్తున్నారు. చాలా బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ పేరుతో కోట్లాది సొమ్మును తమ వద్దే ఉంచుకుంటున్నాయి.

మినిమం బ్యాలెన్స్ విషయంలో SBI మినహాయింపు

కొన్ని బ్యాంకులు అకౌంట్ మెయింటనెన్స్ కింద రూ.300 నుంచి రూ.600 వరకు జరిమానా విధిస్తున్నాయి. ఈ ఫైన్ బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారి ఖాతాదారుల నుంచి రూ.1,538 కోట్ల జరిమానా అమౌంట్ తీసుకుంది. దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) అటువంటి జరిమానాల వసూలును నిలిపివేసింది. గత ఐదేళ్లలో ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు కనీస మొత్తం నిర్వహణ పేరుతో కోట్లలో డబ్బు వసూలు చేశాయి.

ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనీస మొత్తం నిర్వహణపై కొత్త నిబంధనలను అమలు చేయబోతున్నట్లు సమాచారం. మరి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయా లేక నిబంధనల్లో మార్పులు చేస్తారా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.

మినిమం బ్యాలెన్స్ ఆప్షన్ ఉన్న బ్యాంకుల వివరాలు

ఎస్బీఐ ఏ ఖాతాకైనా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ను ఇస్తోంది. దీని ద్వారా మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోయినా ఎలాంటి ఫైన్ వేయదు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ను ఇస్తుంది. అయితే మినిమం బ్యాలెన్స్ ఖాతాలను కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఈ అకౌంట్స్ ఓపెన్ చేసే టైమ్ లో చెక్ తీసుకుంటే మినిమం బ్యాలెన్స్ ప్రాంతాన్ని బట్టి రూ.250, రూ.500, రూ.1000 ఉంచాలి. అకౌంట్ తీసుకొనే టైమ్ లో చెక్ బుక్ తీసుకోకపోతే ఏరియాను బట్టి రూ.100, రూ.250, రూ.500 మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ తెరవదు. ఈ బ్యాంకులో ఖాతా తెరవాలంటే గ్రామీణ ప్రాంతాల బ్రాంచ్ అయితే కనీసం రూ.2500 ఉంచాలి. టౌన్, సిటీస్ బ్రాంచ్ ల్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే కనీసం రూ.5000, రూ.10000 మినిమం బ్యాలెన్స్ ఉంచాలి. మరో ప్రైవేటు బ్యాంకు అయిన ఐసీఐసీఐ కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఇవ్వదు. గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ ఏరియాలను బట్టి రూ.1000, రూ.2000, రూ.5000, రూ.10000 మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాలి. అయితే అక్టోబర్ 15 తర్వాత వచ్చే రూల్స్ ప్రకారం ఈ మినిమం బ్యాలెన్స్ అకౌంట్లలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో వేచి చూడాల్సి ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New rule on savings accounts: What should be the minimum balance from October 15?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0