On which day should Diwali be celebrated?
ఇంతకీ దీపావళి ఏ రోజున జరుపుకోవాలి ?
కొందరేమో అక్టోబర్ 31న అంటుండగా.. మరికొందరు నవంబర్ 1నే దీపావళి పండగ అని చెబుతున్నారు. మరి ఇందులో నిజమేంటి.
అక్టోబర్ 31వ తేదీ గురువారం ఉదయం పూర్వం చతుర్దశి తిథి ఉన్నందున నరక చతుర్దశిగా, దీపావళి పండుగను జరుపుకోవచ్చు. మళ్ళీ ఇదే రోజు గురువారం సాయంకాలానికీ అమావాస్య తిథి ఉన్నందున ధనలక్ష్మి పూజలు ఆచరించవచ్చు. అంటే 31వ తేదీనే రెండు తిథులు ఉన్నందునా రెండు పండుగలు దీపావళి, ధనలక్ష్మిపూజలు ఒకే రోజు జరుపుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. సాధారణంగా దీపావళి పండుగను ఏటా అశ్వయుజ మాసంలో అమావాస్య రోజు జరుపుకుంటారు.
తెలుగు క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 31 మధ్యాహ్నం 3 గంటల 52 నిమిషాలకు అమావాస్య మొదలవుతుంది. ఈ అమావాస్య నవంబర్ 1 సాయంత్రం 6 గంటల 16 నిమిషాలకు ముగుస్తుంది. దాని తరువాత పాడ్యమి మొదలవుతుంది. దీంతో అక్టోబర్ 31నే పండగ జరుపుకోవాలని వేద పండితులు సూచిస్తున్నారు.
0 Response to "On which day should Diwali be celebrated?"
Post a Comment