What to study to become a pilot? Eligibility, cost, details of courses to be studied.
Pilot Career: పైలట్ అవ్వలంటే ఏం చదవాలి? అర్హతలు, ఖర్చు, చదవాల్సిన కోర్సుల వివరాలు.
మన దేశంలో వివిధ రంగాల్లో కెరీర్ సెలక్ట్ చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది భారతీయులు పైలట్ అవ్వాలని కోరుకుంటారు. ఆకాశంలో విమానం నడపాలని, కొత్త ప్రదేశాలను చూడాలని, సమాజంలో గౌరవం పొందాలని టార్గెట్ పెట్టుకున్నవారు ఈ జాబ్ రోల్‌పై ఫోకస్ పెడతారు.
కానీ ఈ జాబ్ రావాలంటే చాలా కష్టపడాలి, చాలా డబ్బు ఖర్చు చేయాలి. చాలామందికి పైలట్ కావడానికి కావాల్సిన అర్హతలు, ట్రైనింగ్, కోర్సుల గురించి తెలియదు. ఈ కెరీర్ ఆప్షన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అర్హత ప్రమాణాలు
భారతదేశంలో పైలట్ అవ్వాలంటే, ఇంటర్మీడియట్ (10+2) పాస్ అయి ఉండాలి. అంతేకాదు, ప్లస్ టూ రేంజ్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ అనే రెండు సబ్జెక్టులు తీసుకొని ఉండాలి. ఈ రెండు సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. హైస్కూల్‌లో ఈ సబ్జెక్టులు చదవని వాళ్ళు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) ద్వారా ఈ సబ్జెక్టులు చదివి పరీక్షలు రాసి పాస్ అయితే సరిపోతుంది. పైలట్ ట్రైనింగ్ 16 ఏళ్ల వయసు నుంచి ప్రారంభించవచ్చు. కానీ, కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) తీసుకోవాలంటే 18 ఏళ్లు నిండాలి
పైలట్ అవ్వాలంటే చదువు చదివి పరీక్షలు రాస్తే సరిపోదు. ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే, విమానం నడపడం అంటే చాలా బాధ్యతాయుతమైన పని. ఒక చిన్న తప్పు చేసినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే, పైలట్‌గా మారాలనుకునే వాళ్లు కొన్ని ఆరోగ్య పరీక్షలు పాస్ అవ్వాలి. వాటిలో క్లాస్ II మెడికల్ ఎగ్జామినేషన్ ఒకటి. ఇది ఒక రకమైన ఆరోగ్య పరీక్ష. ఈ టెస్టులో బాడీ మొత్తం చెక్ చేస్తారు.
క్లాస్ I మెడికల్ ఎగ్జామినేషన్ మరో రకమైన ఆరోగ్య పరీక్ష. కానీ, క్లాస్ II కంటే ఇది కొంచెం టఫ్‌గా ఉంటుంది. ఈ రెండు పరీక్షలను DGCA సంస్థ నియమించిన డాక్టర్లు చేస్తారు. క్లాస్ I మెడికల్ సర్టిఫికేట్ 60 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పైలట్లకు 12 నెలల వరకు మాత్రమే వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. క్లాస్ II మెడికల్ సర్టిఫికేట్ 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పైలట్లకు 60 నెలల వరకు, 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న పైలట్లకు 24 నెలల వరకు చెల్లుబాటు అవుతుంది.
ట్రైనింగ్, కోర్సులు
పైలట్‌గా మారాలంటే కొన్ని లైసెన్స్‌లు అవసరం. అవేంటంటే..
స్టూడెంట్ పైలట్ లైసెన్స్ (SPL): ఇది మొదటి దశ. ఈ లైసెన్స్ తీసుకున్న తర్వాతే పైలట్‌గా మారే ప్రయాణం మొదలవుతుంది.
ప్రైవేట్ పైలట్ లైసెన్స్ (PPL): SPL తీసుకున్న తర్వాత PPL కోసం ప్రయత్నించవచ్చు. ఈ లైసెన్స్ తీసుకోవాలంటే కనీసం 40 గంటలు విమానం నడపాలి. ఈ 40 గంటల్లో 20 గంటలు ఒంటరిగా విమానం నడపాలి, మరో 20 గంటలు ట్రైనర్‌తో కలిసి నడపాలి.
కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL): విమానం నడిపి డబ్బు సంపాదించాలంటే CPL తీసుకోవాలి. ఈ లైసెన్స్ తీసుకోవాలంటే కనీసం 200 గంటలు విమానం నడపాలి. ఈ 200 గంటల్లో దూర ప్రయాణాలు చేయడం, వాతావరణ పరిస్థితులు మారినప్పుడు విమానం ఎలా నడపాలి అనేది కూడా నేర్చుకోవాలి.
ఏర్‌లైన్ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ లైసెన్స్ (ATPL)
పైలట్‌గా అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి అవసరమైన లైసెన్స్ ఇదే. ATPL కోర్సు పూర్తి చేసిన వారు ఎయిర్‌లైన్‌లో పైలట్‌గా పనిచేయడానికి అర్హులవుతారు. ఈ లైసెన్స్ ఉన్న వారు ఒక విమానాన్ని స్వతంత్రంగా నడిపించి, ప్రయాణికులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్లవచ్చు.
టైప్ రేటింగ్
ప్రతి విమానం ఒక రకంగా ఉంటుంది. ప్రతి రకమైన విమానాన్ని నడపడానికి స్పెషల్ ట్రైనింగ్ అవసరం. ఈ ట్రైనింగ్ పూర్తి చేసి పరీక్షలు పాస్ అయితే టైప్ రేటింగ్ వస్తుంది. ఈ టైప్ రేటింగ్ లేకుండా ఆ రకమైన విమానాన్ని నడపడానికి అనుమతి ఉండదు.
ఖర్చులు ఉంటాయి
భారతదేశంలో పైలట్ అవ్వాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుందో అనేది ఎక్కడ చదువుకుంటున్నాం, ఏ విమానంలో ట్రైనింగ్ తీసుకుంటున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో ఎన్ని గంటలు విమానం నడిపితే అన్ని గంటలకు డబ్బు చెల్లించాలి. విమానం నడపడానికి ముందు భూమి మీద కూడా చాలా ట్రైనింగ్ తీసుకోవాలి. దానికి కూడా డబ్బు చెల్లించాలి. లైసెన్స్ తీసుకోవడానికి పరీక్షలు రాస్తారు. ఆ పరీక్షలకు కూడా ఫీజు చెల్లించాలి. ఇంకా చాలా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి.
సరైన ఫ్లైట్ స్కూల్
పైలట్‌గా మారాలనుకునే వారు మొదట మంచి ఫ్లైయింగ్ స్కూల్‌ని ఎంచుకోవాలి. ఎందుకంటే, మనకు ఎలాంటి శిక్షణ ఇస్తారు అనేది స్కూల్ మీదే ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో చాలా ఫ్లైయింగ్ స్కూల్స్ ఉన్నాయి. వీటిని DGCA అనే సంస్థ నియంత్రిస్తుంది. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఫ్లైయింగ్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ చదివిన తర్వాత భారతదేశంలో లైసెన్స్ కన్వర్ట్ చేసుకోవచ్చు. కొన్ని ఫ్లైయింగ్ స్కూల్స్ మనం మొదటి నుండి చివరి దాకా అన్ని కోర్సులు ఒకే చోట చేయడానికి అవకాశం ఇస్తాయి. దీనిని ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటారు.
ఫ్లైయింగ్ స్కూల్ ఎంచుకునే ముందు ఆ స్కూల్‌లో ఏ రకమైన విమానాలు ఉన్నాయి? అక్కడ పని చేసే ట్రైనర్లు మంచి అనుభవం ఉంది? ఆ స్కూల్‌లో చదివిన వాళ్లలో ఎంత మందికి ఉద్యోగాలు వస్తున్నాయి? అనే వివరాలన్నీ తెలుసుకోవాలి
కెరీర్ ఆపర్చునిటీస్
కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) పూర్తి చేసిన తర్వాత, విమానయాన సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో విమానయాన రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా, పైలట్ల అవసరం ఎక్కువగా ఉంది.
0 Response to "What to study to become a pilot? Eligibility, cost, details of courses to be studied."
Post a Comment