Aadhaar Address Update
Aadhaar Address Update : కొత్త ప్రాంతానికి మారారా? మీ ఆధార్‌లో అడ్రస్ ఇలా ఉచితంగా మార్చుకోవచ్చు!
మీరు ఇటీవల కొత్త ప్రదేశానికి మారారా? సరే, మీరు ఇ-కామర్స్ సైట్‌లు, బ్యాంకులు సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో మీ అడ్రస్ అప్‌డేట్ చేసుకోవాలని అనుకుంటున్నారా?
అంతకంటే ముందుగా మీరు మీ ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ ఆధార్‌లో మీ అడ్రస్ అప్‌డేట్ చేయడం మర్చిపోవద్దు. మీ ఆధార్ అడ్రస్ అప్‌డేట్ చేయడం వల్ల దానికి లింక్ చేసిన అన్ని సేవలను సులభంగా యాక్సెస్ చేయొచ్చు. ఐడిటెంటిటీని దుర్వినియోగం చేయకుండా నిరోధించవచ్చు.
ప్రస్తుతం, ఆధార్ అప్‌డేట్ కూడా ఉచితం. యూఐడీఏఐ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఎక్కడి నుండైనా సౌకర్యవంతంగా పూర్తి చేయవచ్చు. ఆధార్ ఉన్నవారు తమ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు గడువును యూఐడీఏఐ పొడిగించింది. మీరు ఇప్పుడు డిసెంబర్ 14, 2024 వరకు ఎలాంటి ఖర్చు లేకుండా మీ అడ్రస్ వంటి వివరాల్లో మార్పులు చేయవచ్చు. జూన్ 2024లో ప్రారంభ గడువు తర్వాత ఇది ఈ ఏడాది రెండోసారి పొడిగించింది.
అయితే, ఈ ఉచిత అప్‌డేట్ కేవలం అడ్రస్ వివరాలకు మాత్రమే వర్తిస్తుంది. ఫింగర్ ఫ్రింట్స్ లేదా ఐరిస్ స్కాన్‌లలో మార్పులు చేయడం వంటి బయోమెట్రిక్ అప్‌డేట్‌లకు ఇప్పటికీ ఆధార్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. దీనికి రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఇటీవల ఏదైనా కొత్త ప్రాంతానికి మారినా లేదా మీ ఆధార్‌లోని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే.. ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధార్ సెల్ఫ్-సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ (myaadhaar.uidai.gov.in) ని సందర్శించండి. లాగిన్ చేయడానికి మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని ఉపయోగించండి. లాగిన్ అయిన తర్వాత, మీ ఆధార్ ప్రొఫైల్‌లో చూపిన జనాభా వివరాలను రివ్యూ చేయండి. మీ అడ్రస్ లేదా ఇతర డేటా పాతది అయితే, అప్‌డేట్ కొనసాగండి.
JPEG, PNG లేదా PDF ఫార్మాట్‌లో చెల్లుబాటు అయ్యే అడ్రస్ ప్రూఫ్ (PoA) డాక్యుమెంట్ స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయండి. గరిష్ట పరిమాణం 2MB ఉండాలి. డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసిన తర్వాత మీ అభ్యర్థనను సమర్పించండి. మీ అప్‌డేట్ స్టేటస్ ట్రాక్ చేయడానికి మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ (SRN)ని అందుకుంటారు.
మీ ఆధార్ అప్‌డేట్ విజయవంతంగా ప్రాసెస్ అయిందో లేదో నిర్ధారించేందుకు మీ (SRN) స్టేటస్ క్రమం తప్పకుండా చెక్ చేయండి. ముఖ్యంగా, యూఐడీఏఐ భారతీయ నివాసితులకు వారి ఆధార్ వివరాలను క్రమంతప్పకుండా అప్‌డేట్ చేయాలని సూచించింది. అడ్రస్ అప్‌డేట్‌లు ఆన్‌లైన్‌లో ఉచితం అయితే, బయోమెట్రిక్ డేటాలో మార్పులు తప్పనిసరిగా అధీకృత ఆధార్ సెంటర్‌లో వ్యక్తిగతంగా పూర్తి చేయాలి. ఇందులో రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఆధార్‌ను అప్‌డేట్ చేయడం అనేది చిన్న వయస్సులో ఆధార్‌ను రూపొందించిన పిల్లలకు, 15 ఏళ్లు నిండిన తర్వాత వారి బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేయాల్సిన పిల్లలకు చాలా ముఖ్యమైనది. అదనంగా, వారి బయోమెట్రిక్ వివరాలను ప్రభావితం చేసే వైద్య విధానాలు లేదా ప్రమాదాలకు గురైన వ్యక్తులు కూడా వారి వివరాలను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూఐడీఏఐ ప్రకారం.. మీ ఆధార్ వివరాలను అప్‌డేట్‌గా ఉంచడం వల్ల సర్వీసులకు యాక్సెస్‌ను పొందవచ్చు.
మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయకపోతే కలిగే అసౌకర్యాలివే
- సరిపోలని అడ్రస్ లేదా పాత డేటా ఆర్థిక లావాదేవీల సమయంలో విమానాశ్రయాలలో లేదా ప్రభుత్వ పథకాలను యాక్సెస్ చేసేటప్పుడు సమస్యలు తలెత్తవచ్చు.
- సరికాని డెమోగ్రాఫిక్ లేదా బయోమెట్రిక్ డేటా అథెంటికేషన్ ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చు. ప్రభుత్వ పథకాల కోసం ఆధార్‌ను ఉపయోగించడం కష్టమవుతుంది.
- రెగ్యులర్ అప్‌డేట్ చేయడం ద్వారా ప్రభుత్వం సురక్షిత డేటాబేస్‌ను నిర్వహించవచ్చు. ఆధార్ దుర్వినియోగం లేదా మోసాలను నివారించవచ్చు.
0 Response to "Aadhaar Address Update"
Post a Comment