AP TET: Big Update on TET Results - DSC Notification
AP TET: టెట్ ఫలితాలు - డీఎస్సీ నోటిఫికేషన్ పై బిగ్ అప్డేట్.
ప్రభుత్వం ఈ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదల చేయనుంది. తాము అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పైన చేస్తామని కూటమి నేతలు నాడు హామీ ఇచ్చారు.
అందులో భాగంగా ఉపాధ్యాయ ఖాళీలను నోటిఫై చేసారు. ఈ నెల 6న డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్దం అవుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన టెట్ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు వెల్లడి కానున్నాయి.
నేడే ఫలితాలు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాలు నేడు (సోమవారం) విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేస్తారు. అక్టోబర్ 3 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో జరిగిన టెట్ పరీక్షకు 4.7 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 17 రోజులపాటు రోజుకు రెండు విడతలుగా ఈ పరీక్షలు నిర్వహించారు. 16,347 పోస్టులతో మెగాడీఎస్సీ నోటిఫికేషన్ జారీచేస్తున్న నేపథ్యంలో టెట్ ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. టెట్‌లో అర్హత సాధించినవారికి డీఎస్సీలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. డిఎస్‌సిలో 20 శాతం వెయిటేజీ కూడా ఉంటుంది.
లైఫ్‌లాంగ్ వ్యాలిడిటీ
ఈ టెట్ స్కోర్‌కు లైఫ్‌లాంగ్ వ్యాలిడిటీ ఉండనుంది. గతంలో టెట్ అర్హత సర్టిఫికెట్ ఏడేళ్లు మాత్రమే చెల్లుబాటు అయ్యేది. 2022 నుంచి దీన్ని జీవిత కాలానికి మార్చారు. 2022 టెట్‌లో చాలామంది అర్హత సాధించినా మార్కుల్లో మెరుగుదల కోసం చాలామంది ఇప్పుడు మరోసారి పరీక్ష రాశారు. ఈ నెల 2నే ఈ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. కానీ, తుది కీ విడుదలలో కొంత మేర జాప్యం జరిగింది. ఇప్పటికే రెస్పాన్స్ షీట్లు, ఫైనల్ కీ వెల్లడించారు. ఫలితాలను ప్రభుత్వం అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు. దీని ద్వారా అభ్యర్ధులు తమ ఫలితాలు చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
డీఎస్సీ నోటిఫికేషన్
టెట్ లో ఉత్తీర్ణతా శాతంకు సంబంధించి ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఓసీ కేటగిరీలో 60 శాతం పైగా మార్కులు రావాల్సి ఉంటుంది. బీసీ కేటగిరీలో 50 శాతం మార్కులు రావాలి. అదే విధంగా .. ఎస్సీ, ఎస్టీ, కేటగిరీలతో పాటుగా దివ్యాంగులు, మాజీ సైనికోద్యుగుల కేటగిరీలో 40 శాతం మార్కులు లేదా ఆపైన మార్కులు పొందిన వారు మాత్రమే టెట్‌లో ఉత్తీర్ణత సాధించినట్లుగా ప్రకటిస్తారు. ఇక..ఇప్పటికే డీఎస్సీ కోసం అభ్యర్ధులు కసరత్తు చేస్తున్నారు. రేపు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలతో డిసెంబర్ నెలాఖరు లోగా మొత్తం భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
0 Response to " AP TET: Big Update on TET Results - DSC Notification"
Post a Comment