AP TRANSCO Jobs
AP TRANSCO Jobs: ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. ఎలాంటి రాత పరీక్ష లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ఏపీ ట్రాన్స్‌కో ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు విజయవాడలోని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఈ నోటిఫికేషన్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రాన్‌కో, ఏపీపీసీసీలో కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆఫ్‌లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 10, 2024వ తేదీని చివరి తేదీగా నిర్ణయించింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ లేదా ఎల్‌ఎల్‌ఎం లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బార్ కౌన్సిల్‌లో నాలుగేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. ఎలాంటి వయోపరిమితి లేదు. ఏడాది కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి ప్రొఫెషనల్ ఫీజు కింద నెలకు రూ.1,20,000 వరకు చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రకటన ఇచ్చిన తేదీ నుంచి 21 రోజులలోపు దరఖాస్తులను ఈ కింది అడ్రస్‌కు పంపించాలి. నోటిఫికేషన్ నవంబర్ 19, 2024వ తేదీన జారీ చేశారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ : 10.12.2024
అడ్రస్:
The Chairman and Managing Director,
APTRANSCO, Vidyut Soudha,
Gunadala, Vijayawada -520004.
(చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ ట్రాన్స్‌కో, విద్యుత్ సౌధ, గుణదల, విజయవాడ-520004
0 Response to "AP TRANSCO Jobs"
Post a Comment