Changing date of birth in Aadhaar cards is easy.. Key decision of AP Govt.
ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు సులభతరం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.
మనదేశంలో ప్రస్తుతం ప్రభుత్వ పరంగా ఏ పని జరగాలన్నా.. ఆధార్ కార్డు కావాల్సిందే. అన్నింటికీ అదే ఆధారం. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల నుంచి గుడిలో దైవ దర్శనాల వరకూ అన్నింటికీ ఆధారం ఆధార్ కార్డే.
మరీ చెప్పాలంటే భారతీయులకు ఆధార్ కార్డు అనేది ఓ నిత్యావసరంగా మారిపోయింది. రేషన్ దుకాణాల నుంచి మొదలుపెడితే.. సిమ్ కొనాలంటే సెల్ ఫోన్ దుకాణాల వరకూ ఆధార్ లేనిదే పని జరగని పరిస్థితి. ఇక వయస్సు ధ్రువీకరణ కోసం కూడా ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు నమోదు సమయంలో పుట్టినరోజు పొరపాటుగా పడిందే.. మార్చుకోవాలంటే చాలా సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆధార్ కార్డుల్లో పుట్టినరోజు మార్పులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు కోసం ప్రభుత్వ వైద్యులు అందించే వయస్సు ధ్రువీకరణ పత్రాలను కూడా అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్చుకోవాలంటే విద్యా ధ్రువీకరణ పత్రాలు లేదంటే.. బర్త్ సర్టిఫికేట్లు ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో పుట్టినవారికి, చదువుకున్నవారికి ఈ సర్టిఫికేట్లు ఉంటాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో నిరక్ష్యరాస్యులకు, కాస్త వయసు పైబడిన వారికి ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్చుకోవాలంటే ఇబ్బంది ఎదురయ్యేది. ఎందుకంటే వారి వద్ద బర్త్ సర్టిఫికేట్లు కానీ.. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లు కానీ ఉండే పరిస్థితి లేదు.
ఈ నేపథ్యంలో అలాంటి వారికి ఉపయోగకరంగా ఉండేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు కోసం మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు ఇచ్చే సర్టిఫికేట్ల తరహాలోనే ప్రభుత్వ ఆస్పత్రుల్లోని డాక్టర్లు అందించే వయస్సు ధ్రువీకరణ పత్రాలను కూడా అనుమతించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఆ సర్టిఫికేట్ల మీద క్యూఆర్ కోడ్ తప్పనిసరి ఉండేలా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అందించే ఈ క్యూఆర్ కోడ్ పత్రాలను.. ఆధార్ కార్డుల్లో పుట్టినరోజు మార్చుకోవటానికి అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఆధార్ కార్డుల జారీని యూఐడీఏఐ పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇలాంటి నిబంధనల సడలింపులపై ఆ సంస్థ, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ మార్పుపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సిఫార్సు చేస్తుందా అనేది చూడాలి.
0 Response to "Changing date of birth in Aadhaar cards is easy.. Key decision of AP Govt."
Post a Comment