Chief Minister Chandrababu said that there is no intention to increase the current charges in AP
ఏపీలో కరెంట్ చార్జీలను పెంచే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం వల్లే పేదలపై విద్యుత్ భారం పడిందని ఆయన తెలిపారు.
ఏపీలో కరెంట్ చార్జీలను పెంచే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం వల్లే పేదలపై విద్యుత్ భారం పడిందని ఆయన తెలిపారు.
అయితే విద్యుత్ రంగంపై రూ .1.25 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. 1998లోనే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చానని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. తలసరి కరెంట్ వినియోగం కూడా పెంచినట్టు తెలిపారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాను. గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారు. అంతేకాక..రాష్ట్ర గల్లా పెట్టేను సైతం ఖాలీ చేశారు.
ఒక్క యూనిట్ కూడా వాడకుండా వేల కోట్లు చెల్లించారు. చరిత్రలో గుర్తుండి పోయేలా అమరావతి ఉద్యమం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా డైవర్ట్ చేశారు. రాష్ట్రంలో 9 సార్లు విద్యుత్ చార్జీలను పెంచారు. ప్రస్తుతం ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు . వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో అంతా మోసమే జరిగింది. తనను అవమానించడమే కాకుండా తన భార్యను కూడా అవమానించారు. తన భార్య వల్ల తాను కన్నీళ్లు పెట్టిన పరిస్థితి ఏర్పడిందని సీఎం చంద్రబాబు తెలిపారు.
మరోవైపు క్రీడా పాలసీని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఆయన ఫోటోకు అమృత్‌సర్‌లో క్రీడాకారులు క్షీరాభిషేకం చేశారు. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటీ పోటీల సందర్భంగా గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయంలో క్రీడాకారులు ఈ కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు రాకతో క్రీడలకు మళ్లీ జోష్ వచ్చిందని, ఇతర రాష్ట్రాలు సైతం ఏపీ తరహాలో ప్రోత్సాహకాలు అందించాలని జె.బాబులాల్ నాయక్ కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు.
0 Response to "Chief Minister Chandrababu said that there is no intention to increase the current charges in AP"
Post a Comment