Huge good news for pensioners.. Money even if there are more daughters
Pension: పెన్షన్‌దారులకు భారీ శుభవార్త.. ఇకపై కూతుళ్లు ఉంటే కూడా డబ్బులు
ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వాలు పెన్షన్ అందజేస్తాయి. ఊహించని ప్రమాదాల్లో ఉద్యోగి కుటుంబానికి రక్షణ అందిస్తాయి.
అయితే ఫ్యామిలీ పెన్షన్ నియమాలు స్పష్టంగా ఉండాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు పేమెంట్స్ సకాలంలో అందాలని పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ కీలక చర్యలు తీసుకుంది. ఫ్యామిలీ పెన్షన్ ఎలిజిబిలిటీకి సంబంధించిన డౌట్స్ క్లియర్ చేయడం, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయడం వంటి లక్ష్యాలతో కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేకించి అంగవైకల్యం లేదా సర్వీసులో ఉండగా మరణించిన వారికి అందించే ఎక్స్‌ట్రార్డినరీ పెన్షన్ (EOP)కి సంబంధించిన రూల్స్‌పై క్లారిటీ ఇచ్చింది.
ఫ్యామిలీ పెన్షన్‌కి కుమార్తె అర్హత
ఫ్యామిలీ పెన్షన్ పొందేందుకు అర్హులైన కుటుంబ సభ్యుల జాబితా నుంచి కుమార్తె పేరును తొలగించలేమని పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. ఒక కుమార్తె, అవివాహిత, వివాహిత లేదా వితంతువు అయినా, ఆమె పేరును ప్రభుత్వ ఉద్యోగి సూచించిన ఫార్మాట్‌లో సమర్పిస్తే, ఆమెకు అర్హత ఉంటుంది. పెన్షనర్ మరణించిన తర్వాత ఫ్యామిలీ పెన్షన్‌కి కుమార్తె ఎలిజిబిలిటీని నిబంధనల ప్రకారం పరిశీలిస్తారు.
వితంతువులు, రెండో పెళ్లి నియమాలు
ప్రభుత్వ ఉద్యోగికి ఇద్దరు వితంతువులు ఉంటే, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 2021 ప్రకారం, రెండో వివాహానికి చట్టబద్ధత ఏర్పడిన తర్వాత మాత్రమే ఫ్యామిలీ పెన్షన్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులందరి చేరిక
ప్రభుత్వ ఉద్యోగి పని చేయడం ప్రారంభించిన వెంటనే, వారు తప్పనిసరిగా తమ జీవిత భాగస్వామి, పిల్లలు (పెంచుకున్న పిల్లలతో సహా), తల్లిదండ్రులు, వికలాంగులైన తోబుట్టువులను కలిగి ఉన్న కుటుంబ జాబితాను సమర్పించాలి. పదవీ విరమణ చేయడానికి ముందు, ఉద్యోగులు తప్పనిసరిగా కుటుంబ పెన్షన్ పంపిణీ కోసం కుటుంబ వివరాలు అందజేయాలి. కచ్చితమైన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి.
కుమార్తె పెన్షన్ హక్కుల మార్గదర్శకాలు
సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ ప్రకారం, కుమార్తెల అర్హత నియమాలు కింది విధంగా ఉన్నాయి:
- కుమార్తె అవివాహితగా, వితంతువుగా లేదా విడాకులు తీసుకుంటే, 25 ఏళ్ల తర్వాత కూడా ఫ్యామిలీ పెన్షన్ పొందవచ్చు. అయితే కుటుంబంలోని మిగతా పిల్లలందరికీ 25 ఏళ్లు నిండి ఉండాలి, స్వతంత్రంగా సంపాదిస్తుండాలి.
- కుమార్తె వివాహం చేసుకుంటే లేదా సంపాదించడం ప్రారంభిస్తే, ఆమె ఫ్యామిలీ పెన్షన్ అర్హత కోల్పోతుంది. ఒక వేళ వైకల్యం ఉండటం వంటి మినహాయింపుల కిందకు వస్తే పెన్షన్ అందుతుంది
- కుటుంబంలో వికలాంగ బిడ్డ ఉంటే, ఇతర కుటుంబ సభ్యుల కంటే ఫ్యామిలీ పెన్షన్ పొందడానికి మొదటి హక్కు ఆ బిడ్డకే ఉంటుంది.
ఫ్యామిలీ పెన్షన్ రేట్లు, పాత పెన్షన్ పథకం (OPS)
పాత పెన్షన్ స్కీమ్ (OPS) కింద, మరణించిన ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతం ఆధారంగా ఫ్యామిలీ పెన్షన్ కాలిక్యులేట్ చేస్తారు.
సాధారణంగా, ఫ్యామిలీ పెన్షన్ చివరిగా తీసుకున్న జీతంలో 30%గా నిర్ణయిస్తారు. ఉద్యోగి కనీసం 7 సంవత్సరాల క్వాలిఫైయింగ్ సర్వీస్‌ను పూర్తి చేసుంటే, ఫ్యామిలీ పెన్షన్ రేటును చివరిగా తీసుకున్న పేమెంట్‌లో 50%కి పెంచవచ్చు. ఈ అధిక రేటు మరణించిన 7 సంవత్సరాలకు లేదా పెన్షనర్ 67 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు, ఏది ముందుగా వస్తే దానికి వర్తిస్తుంది. ఈ వ్యవధి తర్వాత ఫ్యామిలీ పెన్షన్ ప్రామాణిక 30% రేటుకు తిరిగి వస్తుంది.
ఎక్స్‌ట్రార్డినరీ పెన్షన్ (EOP), డిజేబిలిటీ పెన్షన్
సర్వీసులో వైకల్యం లేదా మరణానికి సంబంధించిన కేసులకు ఎక్స్‌ట్రార్డినరీ పెన్షన్ (EOP) మంజూరు చేయవచ్చు. అయితే పేమెంట్స్‌లో జాప్యాన్ని నివారించడానికి విభాగాల మధ్య స్పష్టత అవసరం. లేకపోతే ఆయా శాఖల మధ్య సమన్వయ లోపంతో పెన్షన్ ఆలస్యం కావచ్చు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకే ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది.
0 Response to "Huge good news for pensioners.. Money even if there are more daughters"
Post a Comment