Inviting applications for Apprenticeship in APSRTC
APSRTC : ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటీస్‌షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానం.. ఆఖరు తేదీ నవంబర్ 20
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ ట్రేడ్‌ల్లో ఖాళీలను బట్టీ అప్రెంటీస్‌షిప్‌నకు ఏపీఎస్ ఆర్టీసీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈనెల 20వ తేదీ లోపు అప్లై చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఏ జిల్లాల్లో ఏ ట్రేడ్‌లో ఖాళీ?..
1. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్-20, మోటార్ మెకానిక్-1, ఎలక్ట్రీషియన్-5, వెల్డర్-1, పెయింటర్ -1, ఫిట్టర్-2, డాఫ్ట్స్ మెన్ సివిల్-1 మొత్తం 31 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
2. ఏలూరు జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్-17, మోటార్ మెకానిక్-1, ఎలక్ట్రీషియన్-5, ఫిట్టర్-1 మొత్తం 24 ఖాళీలకు అప్రెంటీస్‌షిప్‌నకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
3. కృష్ణా జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్-28, మోటార్ మెకానిక్-1, ఎలక్ట్రీషియన్-8, వెల్డర్-1, ఫిట్టర్-3 మొత్తం 41 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
4. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్-64, మోటార్ మెకానిక్-3, ఎలక్ట్రీషియన్-19, వెల్డర్-1, పెయింటర్ -1, మెషినిస్ట్-3, ఫిట్టర్-7, డాఫ్ట్స్ మెన్ సివిల్-1 మొత్తం 99 ఖాళీలకు అప్రెంటీస్‌షిప్‌నకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
5. గుంటూరు జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్-31, మోటార్ మెకానిక్-1, ఎలక్ట్రీషియన్-8, వెల్డర్-1, ఫిట్టర్-3, డాఫ్ట్స్ మెన్ సివిల్-1 మొత్తం 45 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
6. బాపట్ల జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్ -19, మోటార్ మెకానిక్-1, ఎలక్ట్రీషియన్-5, ఫిట్టర్-1 మొత్తం 26 ఖాళీలకు అప్రెంటీస్‌షిప్‌ంకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
7. పల్నాడు జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్-32, మోటార్ మెకానిక్-1, ఎలక్ట్రీషియన్-7, వెల్డర్-1, పెయింటర్ -1, ఫిట్టర్-3 మొత్తం 45 ఖాళీలకు అప్రెంటీస్‌షిప్‌నకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
అర్హతలు..
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే ఆయా జిల్లాల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఆయా ట్రేడుల్లో ఐటీఐని గుర్తింపు పొందిన సంస్థ నుంచి పూర్తి చేసి ఉండాలి.
అప్లై చేయు విధానం
ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటీస్‌షిప్ కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. అప్రెంటీస్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థి తప్పనిసరిగా ఈ-మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ కలిగి ఉండాలి. అధికారిక వెబ్‌సైట్ https://www.apprenticeshipindia.gov.in/ లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే వెబ్‌సైట్‌లో సర్టిఫికెట్‌లను అప్‌డేట్ చేసుకోవాలి.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్లు జిరాక్స్ కాపీలు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో వెరిఫికేషన్‌కు కోసం చెరువు సెంటర్, విద్యాధరపురం, విజయవాడంలోని జోన్ సిబ్బంది శిక్షణా కాళాశాల వద్దకు ఉదయం 10 గంటలకు హాజరు కావాలి. రూ.118 (రూ.100+రూ.18 జీఎస్‌టీ) ప్రొసెసింగ్ ఫీజు చెల్లించాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలో నోటిఫికేషన్‌లో వెల్లడించలేదు. త్వరలో వెల్లడిస్తారు. ఏపీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు.
అవసరమైన సర్టిఫికెట్లు.
1. ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్న నంబర్‌తో పాటు ప్రొఫైల్.
2. పదో తరగతి మార్కులు జాబితా
3. ఐటీఐ మార్కులు జాబితా
4. ఎన్‌సీవీటీ సర్టిఫికేట్
5. కుల ధ్రువీకరణ పత్రం
6. దివ్యాంగులైతే ఆ సర్టిఫికేట్l
7. మాజీ సైనికోద్యోగుల పిల్లలైతే ధృవీకరణ పత్రం
8. ఎన్‌సీసీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే అవి
9. ఆధార్ కార్డు
10. పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్
11. రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలు.
APSRTC VIJAYAWADA ZONE APPRENTICE RECRUITMENT NOTIFICATION
APSRTC KURNOOL ZONE APPRENTICE RECRUITMENT NOTIFICATION
0 Response to "Inviting applications for Apprenticeship in APSRTC"
Post a Comment