Key points about generating APAAR ID
APAAR ID generate చేయడం గురించి ముఖ్య విషయాలు
ప్రతి పాఠశాల వారు విద్యార్థుల కు APAAR కి సంబంధించి parent consent form ను ఇచ్చి, డీటెయిల్స్ పూర్తి చేసి వాళ్ళ పేరెంట్స్ సంతకం తీసుకుని, ఆ forms ని జాగ్రత్తగా ఫైల్ చేసుకోవాలి.
udise లో స్టూడెంట్ మాడ్యూల్ లో students లిస్ట్ లో విద్యార్థుల active స్టూడెంట్స్ లిస్ట్ ఓపెన్ చేయాలి.
ప్రతీ స్టూడెంట్ ఎదురుగా చివరి కాలంలో UIDAI స్టూడెంట్ డీటెయిల్స్ VERIFIED అని GREEN కలర్ లో ఉంటే ఎటువంటి ప్రాబ్లెమ్ లేదు.
అలా గ్రీన్ కలర్ లో ఉన్న అన్ని పేర్లకు APAAR ID create చేయాలి.
ఒకవేళ రెడ్ కలర్ లో mismatched అనిగానీ, ఇంకేమైనా మెసేజ్ కానీ ఉంటే వాటికి APAAR ID create అవదు. ఒకవేళ రెడ్ కలర్ లో mismatched అనిగానీ, ఇంకేమైనా మెసేజ్ కానీ ఉంటే వాటికి APAAR ID create అవదు. ఎందుకు మిస్ మ్యాచ్ అవుతుందో జాగర్తగా UDISE లో పేరు, ఆధార్ నెంబర్, ఆధార్ కార్డు లో ఆధార్ నెంబర్, స్టూడెంట్ పేరు సరిగా ఉన్నవో లేవో సరిచూసుకోవాలి.
UDISE లో మార్చగలిగినవి సంబంధిత అధికారుల అనుమతితో మార్చుకోవచ్చు.
ఆధార్ కార్డు నందు మార్చవలసివస్తే, విద్యార్థుల తల్లి తండ్రులకి చెప్పి ఆధార్ సెంటర్ కి పంపించవలెను.
APAAR ID ఎలా generate చేయాలంటే. (గ్రీన్ కలర్ లో ఉన్నవారికి మాత్రమే)
Udise లోని స్టూడెంట్ మాడ్యూల్ లో APAAR ID module ని ఓపెన్ చేయాలి. విడివిడిగా సెలెక్ట్ చేసుకోవాలి.
ప్రతి స్టూడెంట్ కి ఎదురుగా చివరి కాలమ్ లో generate అని ఉంటుంది. అక్కడ సెలెక్ట్ చేయాలి.
Next Window లో parent consent form వస్తుంది.
ముందుగా 'Do you want to change aadhaar details?' అని ఉంటుంది. అక్కడ ఎటువంటి మార్పులు చేయవద్దు. ఆల్రెడీ కరెక్ట్ గా ఉన్న విద్యార్ధులకు మనం APAAR చేస్తున్నాము.
దాని క్రింద Consent form ఉంటుంది. దానిలో I అని ప్రక్కనే ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో తండ్రి/తల్లి/గార్డియన్ పేరు టైప్ చేయాలి.
తరువాత స్టూడెంట్ పేరు ఉంటుంది. అక్కడ మనం ఏమీ చేయకూడదు. తరువాత రిలేషన్ అడుగుతుంది. ఆ బాక్స్ లో తండ్రి/తల్లి/లీగల్ గార్డియన్ ను సెలెక్ట్ చేయాలి.
తరువాత ID ప్రూఫ్ నెంబర్ అడుగుతుంది. ఆ బాక్స్ లో ఆధార్ కార్డ్ మొ || ID సెలెక్ట్ చేయాలి. తరువాత ప్రూఫ్ టైపు బాక్స్ లో విద్యార్థి యొక్క తండ్రి/తల్లి/గార్డియన్ యొక్క ఆధార్ నెంబర్. మొదలైన ID Proof నెంబర్ టైప్ చేయాలి.
చివరిలో place of physical consent అని ఉంటుంది. అక్కడ మీ ప్రాంతం పెరు టైప్ చేయాలి.
ఉదా :- ముత్తుకూరు. ఆ ప్రక్కనే తేదీ అడుగుతుంది. తేదీని సెలెక్ట్ చేయాలి.
అంతా అయిపోయాక ఒకసారి చెక్ చేసుకుని చివరిలో Submit చేయాలి...డేటా Edit లేదు.
Confirmation అడుగుతుంది. OK చేస్తే కాంఫైర్మ్ అయిపోయి ఆ స్టూడెంట్ కి APAAR ID generate అవుతుంది.
ఒకసారి confirm చేసి ok చేస్తే మళ్లీ మళ్లీ మార్పులు, చేర్పులకు అవకాశం లేదు. కాబట్టి జాగ్రత్తగా చేయండి.
Note:- పేరెంట్ సంతకం చేసిన Parent consent form తప్పనిసరిగా మనవద్ద ఫైల్ చేసుకోవాలి.
0 Response to "Key points about generating APAAR ID "
Post a Comment