Post Office Schemes
Post Office Schemes: ఆ పోస్టాఫీస్ స్కీమ్‌తో అదిరే రాబడి.. మహిళలకు మాత్రమే ప్రత్యేకం.
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ భారతదేశంలో అన్ని పోస్ట్ ఆఫీసుల్లో అందబాటులో ఉంది. ఈ మహిళల కోసమే రూపొందించిన ప్రత్యేక పథకం. మహిళలు కొద్దిమాత్రం పెట్టుబడి రెండేళ్ల పాటు పెట్టాల్సి ఉంటుంది
ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడిపై 7.5 శాతం వరకు వడ్డీ అందిస్తారు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ చిన్న పొదుపు పథకమని నిపుణులు చెబుతున్నారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టే మహిళలు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఇందులో పెట్టుబడి గరిష్ట పరిమితి రూ. 2 లక్షలుగా ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని 2023 సంవత్సరంలో ప్రారంభించారు. అతి తక్కువ సమయంలో ఈ పథకం ప్రజల ఆదరణ పొందిందని నిపుణులు వివరిస్తున్నారు.
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్‌లో వచ్చిన వడ్డీని లెక్కిస్తే ఈ పథకంలో రెండేళ్ల పాటు రెండు లక్షల పెట్టుబడిపై 7.5 శాతం వడ్డీ ఇస్తారు. ఒక పెట్టుబడిదారు మొదటి సంవత్సరంలో రూ. 15,000, స్థిర వడ్డీ రేటుతో వచ్చే ఏడాది మొత్తంపై వచ్చే వడ్డీతో కలుపుకుంటే రూ. 16,125 అవుతుంది. అంటే రెండేళ్ల వ్యవధిలో కేవలం రూ.2 లక్షల పెట్టుబడిపై మొత్తం రాబడి రూ.31,125గా ఉంటుంది.
బోలెడన్ని పన్ను ప్రయోజనాలు
ప్రభుత్వం అమలు చేస్తున్న ఇటువంటి పోస్టాఫీసు పథకాలు మహిళలను స్వావలంబన చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్‌లో పెట్టుబడిపై 7.5 శాతం బలమైన వడ్డీ ఇవ్వడమే కాకుండా ఆదాయపు పన్ను సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా ఇందులో పెట్టుబడిగా ఉంది. ఈ పథకంలో మరో ప్రత్యేకత ఏమిటంటే 10 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలకు కూడా ఖాతా తెరవవచ్చు.
0 Response to "Post Office Schemes"
Post a Comment