SBI Recruitment 2024: Apply for 169 Assistant Manager Posts Details
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 169 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు - బేసిక్ పే స్కేల్: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు.
ఎస్బీఐ సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్... స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 169 అసిస్టెంట్ మేనేజర్ నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. బీఈ / బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిసెంబర్ 12వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీలు:
1. అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- సివిల్): 42 పోస్టులు
2. అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఎలక్ట్రికల్): 25 పోస్టులు
3. అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఫైర్): 101 పోస్టులు
బ్యాక్ లాగ్ ఖాళీలు:
1. అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- సివిల్) 01 పోస్టు
అర్హతలు: బీఈ/ బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఫైర్/ సేఫ్టీ & ఫైర్ ఇంజినీరింగ్/ ఫైర్ టెక్నాలజీ & సేఫ్టీ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 01.10.2024 నాటికి అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఫైర్) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు; ఇతర పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
బేసిక్ పే స్కేల్: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).
ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటరాక్షన్ ఆధారంగా; అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీర్- ఫైర్) పోస్టులకు అప్లికేషన్ షార్టిస్టింగ్, ఇంటరాక్షన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా ఎస్బీఐ శాఖల్లో నియామకాలు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 22.11.2024
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12.12.2024
0 Response to "SBI Recruitment 2024: Apply for 169 Assistant Manager Posts Details "
Post a Comment