There should be reforms in the education system: Minister Lokesh
విద్యావ్యవస్థలో సంస్కరణలు ఉండాలి: మంత్రి లోకేశ్
- వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేశ్ భేటీ
- విద్యార్థులపై ప్రయోగాలు వద్దు.. ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి: లోకేశ్
- వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులను కోరిన మంత్రి
- విద్యావ్యవస్థలో సంస్కరణలు ఉండాలి
- సాంకేతికతతో విద్యావ్యవస్థలో సత్ఫలితాలకు ప్రణాళికలు రచిస్తున్నాం
- త్వరలోనే ఐటీ పాలసీ..
‘‘ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్న ఐటీ కంపెనీలను కూడా ఏపీకి ఆహ్వానించటంలో శాసనసభ్యులు కూడా సహకరించాలి. కంపెనీలు ఏపీకి తేవటంలోనా ఒక్కడి వల్లే సాధ్యం కాదు అందరూ సహకరించాలి. ఏపీలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించటమే మా ప్రభుత్వ లక్ష్యం. టైర్ 2,3 సిటీస్‌లో కూడా ఐటీ స్పేస్ రావాల్సి ఉంది. అందుకే ద్వితీయశ్రేణి నగరాల్లో కూడా కో వర్క్సింగ్ స్పేస్‌ను కల్పించేలా కార్యాచరణ చేపట్టాం. త్వరలోనే ఐటీ పాలసీ కూడా తీసుకువస్తున్నాం. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఐటీ నిపుణులు పనిచేస్తున్నారు. అదానీతో పాటు కొన్ని కంపెనీలు విశాఖపట్నంకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. డేటా సెంటర్‌లకు సంబంధించిన ఓ జాతీయ స్థాయి ఫ్రేమ్ వర్క్ రూపకల్పన జరుగుతోంది. వచ్చే మూడు నెలల్లో విశాఖలోని ఐటీ హిల్స్‌పై డేటా సెంటర్లు వస్తాయి. నిక్సీ సంస్థతో మాట్లాడుతున్నాం, సింగపూర్ నుంచి సీ ల్యాండింగ్ ఇంటర్నెట్ కేబుల్ తీసుకువచ్చేలా ప్రయత్నం చేస్తున్నాం’’ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
0 Response to "There should be reforms in the education system: Minister Lokesh"
Post a Comment